
హైదరాబాద్ లోని అత్తాపూర్ లో అర్థరాత్రి విధ్వంసం సృష్టించాడు ఓ డీసీఎం డ్రైవర్.మితిమీరిన వేగంతో వెళ్తూ.. వీధుల్లో పార్క్ చేసిన కార్లు, బైకులను గుద్దుకుంటూ వెళ్ళాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు స్థానికులు. శుక్రవారం ( సెప్టెంబర్ 4 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి…
అత్తాపూర్‌లో అర్ధరాత్రి మద్యం మత్తులో ఓ డీసీఎం డ్రైవర్ హల్‌చల్ చేశాడు. వేగంగా డీసీఎం నడుపుతూ పలు కార్లు, బైకులను ఢీకొట్టి ధ్వంసం చేశాడు. అంతేకాకుండా మరికొన్ని చోట్ల ఇళ్ల కాంపౌండ్ గోడలను సైతం ఢీకొట్టి దెబ్బతీశాడు. డీసీఎం డ్రైవర్ హంగామాతో భయాందోళనకు గురయ్యారు స్థానికులు.
ఎట్టకేలకు అప్రమత్తమైన స్థానికులు డీసీఎం డ్రైవర్ ను పట్టుకొని దేహశుద్ది చేశారు. అనంతరం డ్రైవర్ ను పోలీసులకు అప్పగించారు స్థానికులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని డీసీఎం వాహనాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు పోలీసులు.