Reading Time: 2 minutes

బీసీసీఐ బిగ్ ప్లాన్: 2027–31 షెడ్యూల్ మార్పు.. ముక్కోణపు సిరీస్‌లు మళ్లీ స్టార్ట్?

Caption of Image.

Team India: భారత క్రికెట్ జట్టు విదేశీ పర్యటనలు, ముఖ్యంగా సేనా (SENA – సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో పర్యటించేటప్పుడు ప్లేయర్లు ఆయా వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేందుకు (Acclimatisation) తగినంత సమయం కేటాయించాలని బీసీసీఐ నిర్ణయించింది. సెప్టెంబర్ 22, 23 తేదీల్లో దుబాయ్‌లో జరగబోయే ఐసీసీ ఎఫ్‌టీపీ (FTP – Future Tours Programme) వర్క్‌షాప్‌లో 2027–31 క్యాలెండర్‌పై బీసీసీఐ తన ప్రతిపాదనలను ఉంచనుంది. అన్ని క్రికెట్ బోర్డుల ప్రతినిధులతో పాటు టాప్-8 అసోసియేట్ దేశాలు పాల్గొనే ఈ సమావేశంలో టీమిండియా మ్యాచ్ షెడ్యూలింగ్‌పై క్లారిటీ రానుంది. 

ఆటగాళ్ల ఫిట్‌నెస్ ముఖ్యం.. బీసీసీఐ కార్యదర్శి క్లారిటీ: 

ఈ విషయమై బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జీత్ సైకియా మాట్లాడుతూ.. ఏడాది పొడవునా బిజీ షెడ్యూల్ వల్ల ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు. సేనా దేశాల పర్యటనలకు ముందు ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి దక్కేలా, ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడేలా రాబోయే ఎఫ్‌టీపీలో షెడ్యూల్ రూపొందించాలని అధికారులను ఆదేశించామన్నారు.2028–31 మధ్య ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లతో పాటు నాలుగు ఐసీసీ మెగా ఈవెంట్లు (2028 టీ20 వరల్డ్ కప్, 2029 ఛాంపియన్స్ ట్రోఫీ, 2030 టీ20 వరల్డ్ కప్, 2031 వన్డే వరల్డ్ కప్) జరగనున్న నేపథ్యంలో ఈ బ్రేక్స్ కేటాయించడం బీసీసీఐకి సవాలుగా మారనుంది.

ద్వైపాక్షిక సిరీస్‌లకు గుడ్ బై? మళ్లీ ముక్కోణపు సిరీస్: 

ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్‌లో కేవలం రెండు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక (Bilateral) సిరీస్‌లకు ఆదరణ, ఆర్థిక రాబడి తగ్గుతుండటంతో బోర్డులు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాయి. రాబోయే ఎఫ్‌టీపీ సైకిల్‌లో ముక్కోణపు (Tri-Series) లేదా చతుర్భుజి (Quadrangular) టోర్నీలను పునరుద్ధరించే ఛాన్స్ ఉంది. 

* మల్టీలేటరల్ టోర్నీలు: ద్వైపాక్షిక మ్యాచ్‌లతో పోలిస్తే మూడు లేదా అంతకంటే ఎక్కువ దేశాలు ఆడే టోర్నీల ద్వారా ఆర్థికంగా ఎక్కువ ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు.

* భారత్ రికార్డు: టీమిండియా చివరిగా 2018లో నిదహాస్ ట్రోఫీ టీ20 ముక్కోణపు సిరీస్ ఆడి విజేతగా నిలిచింది.

ALSO READ : 13 జట్లు, 163 మ్యాచ్‌లు: అక్టోబర్ 10 నుంచి ఫుట్‌బాల్ ధమాకా

* స్వంత గడ్డపై ప్రయోగాలు: స్వదేశంలో 2003-04 (టీవీఎస్ కప్) తర్వాత మళ్లీ ఎలాంటి ముక్కోణపు వన్డే సిరీస్ నిర్వహించలేదు.

* భారత ఆటగాళ్లకు తగిన విశ్రాంతిని అందిస్తూనే, క్రికెట్ మ్యాచ్‌లకు డిమాండ్ పెంచేలా బీసీసీఐ ఈ కొత్త ఎఫ్‌టీపీ క్యాలెండర్‌ను రూపొందించేందుకు రెడీ అవుతోంది.

©️ VIL Media Pvt Ltd.