
రెడీ టూ ఈట్.. రెడీ టూ కుక్.. ఫేమస్ అయిన వాయ్ వాయ్ బ్రాండ్ కంపెనీ సీజీ ఫుడ్స్ ప్రొడక్ట్స్ గురించి తెలిసే ఉంటుంది. నూడిల్స్ ద్వారా ఫేమస్ అయిన కంపెనీ ఆ తర్వాత భుజియా ప్రవేశ పెట్టి మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే భుజియా తయారీలో కస్టమర్లను కంపెనీ చేస్తున్న మోసాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు బట్టబయలు చేశారు.
ఫుడ్ సేఫ్టీ అధికారులు రాజస్థాన్ లోని సీజీ ఫుడ్ ఇండియాపై యాక్షన్ తీసుకున్నారు. నేపాల్ బిలియనీర్, ఇన్ స్టంట్ నూడిల్స్ తయారీతో నూడిల్స్ కింగ్ గా పేరొందిన వినోద్ చౌదరీకి చెందిన సీజీ కార్ప్ గ్లోబల్ పై అధికారులు చేసిన దాడిలో ఆశ్చర్యకరమైన నిజాలు గుర్తించారు.
భుజియా తయారీలో కంపెనీ అనుసరిస్తున్న విధానాలపై ఆహార భద్రత అధికారులు ఆగ్రహానికి గురయ్యారు. ఇన్ స్టంట్ నూడిల్స్ తయారీలో మిగిలి పోయిన, విరిగిపోయిన నూడిల్స్ వేస్టేజ్ ను ఉపయోగించి భుజికా చేస్తున్నట్లు గుర్తించారు. కనీసం హీట్ ట్రీట్మెంట్ కూడా లేకుండా చేస్తున్న పద్ధతిని చూసి షాకయ్యారు.
చిన్న చిన్న పాకెట్లలో అమ్మే భుజియా స్నాక్స్ ఇండియాలో చాలా ఫేమస్. ఈ కంపెనీకి చెందిన రెండు భుజియా స్నాక్స్ ను సీజ్ చేశారు అధికారులు. అంతే కాకుండా 32 వేల కేజీల స్టాక్ ను సీజ్ చేశారు. వీటికి తోడు 1925 కేజీల కాలం చెల్లిన ప్రొడక్ట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కంపెనీ ప్రొడక్ట్స్ ను టెస్టింగ్ కోసం శాంపిల్స్ తీసుకున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.
ALSO READ : రంగు రంగుల టూటీ ఫ్రూటీ అంటే ఇష్టమా..?
మహారాష్ట్రలో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన రైడ్స్ లో ఇటీవలే నెస్ట్లే, యూనిలీవర్, కోకాకోలా, పెప్సికో లాంటి మల్టీ నేషనల్ బ్రాండ్స్ కు సంబంధించి కల్తీ బయటపడిన విషయం తెలిసిందే. ఆ బ్రాండ్స్ లో కల్తీ, కెమికల్స్ కలిపినట్లు బయటపడిన కొద్ది రోజులకే వాయ్ వాయ్ బ్రాండ్ భాగోతం బయట పడటం ఆందోళన కలిగించే అంశం.