
- మరో రూట్లో 50 శాతమే
- ఆదరణను బట్టి సర్వీసులు పెంచాలని నిర్ణయం
హైదరాబాద్‌సిటీ సిటీ, వెలుగు : మహానగరంలో నైట్‌లైఫ్ కు అనుగుణంగా ఆర్టీసీ అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చిన ‘నైట్‌రైడర్’ సర్వీసులకు ఆదరణ లభిస్తోంది. 1వ తేదీ అర్ధరాత్రి నుంచి ప్రారంభించిన ఈ థర్డ్షిఫ్ట్ సర్వీసులు ప్రస్తుతం 6 రూట్లలో రాత్రి 11గంటల నుంచి ఉదయం 5గంటల వరకు నడుస్తున్నాయి. 222ఏ, 218, 219, 290యు, 195డబ్ల్యూ, 10హెచ్ వంటి రూట్లలో రెండు నుంచి నాలుగు బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఇంతకుముందు రాత్రి వేళల్లో బస్సు సర్వీసులు లేకపోవడం వల్ల ఊళ్లకు వెళ్లి రాత్రిళ్లు వచ్చేవారు, నైట్షిఫ్ట్డ్యూటీలు చేసే సాఫ్ట్వేర్, ఇతర ప్రైవేట్‌ఉద్యోగులు కష్టాలు పడేవారు. తప్పనిసరిగా క్యాబ్‌లు, ఆటోల్లో వెళ్లాల్సి రావడంతో ఖర్చులు తడిసి మోపెడయ్యేవి. నైట్రైడర్బస్సుల్లో సాధారణ ఛార్జీలనే తీసుకుంటుండడంతో పాటు మహిళలకు స్కీంను కూడా వర్తింపజేయడం కలిసివచ్చింది.
222ఏ రూట్ లో నాలుగు బస్సులు
కోఠి – పటాన్చెరు(222ఎ) సర్వీసులో 80 శాతం ప్రయాణికులు జర్నీ చేస్తున్నారని అధికారులు చెప్తున్నారు. ఈ బస్సులో కోఠి నుంచి ఆబిడ్స్, లక్డీకాపూల్, మాసాబ్‌టాంక్, బంజారాహిల్స్కేర్ హాస్పిటల్, అన్నపూర్ణ స్టూడియో, గుట్టల బేగంపేట, హైటెక్‌సిటీ, కొండాపూర్, హఫీజ్‌పేట్, లింగంపల్లి, ఆర్సీపురం, బీరంగూడ మీదుగా పటాన్చెరు వెళ్తుండడంతో ఈ రూట్లో రాత్రిళ్లు వెళ్లేవారికి ఉపయోగకరంగా మారాయి. మొత్తం నాలుగు బస్సులను తెల్లారేవరకు ట్రిప్పులు కొడుతుండడంతో తిప్పలు తప్పాయి.
కోఠి–పటాన్చెరు(218) సర్వీసు కూడా లక్డీకాపూల్, ఎస్ఆర్నగర్, కేపీహెచ్‌బీ కాలనీ, మియాపూర్, లింగంపల్లి, ఆర్సీపురం మీదుగా పటాన్‌చెరుకు వెళ్తోంది. ఈ రూట్లో రెండు బస్సులను నడుపుతుండగా ఇందులో కూడా 80 శాతం సీట్లు ఫుల్అవుతున్నాయి.
సికింద్రాబాద్–పటాన్చెరు(219) బస్సు సికింద్రాబాద్రైల్వేస్టేషన్నుంచి స్టార్టయి ప్యారడైజ్, బోయిన్పల్లి, బాలానగర్ క్రాస్‌రోడ్స్, ఐడీపీఎల్, ప్రశాంత్‌నగర్, కూకట్పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, హైదర్‌నగర్, లింగంపల్లి, ఆర్సీ పురం మీదుగా పటాన్చెరు వరకు వెళ్తుండగా 75 శాతం ప్రయాణికులు జర్నీ చేస్తున్నారు.
బాచుపల్లి-వేవ్‌రాక్(195డబ్ల్యూ) రూట్బస్సు బాచుపల్లిలో మొదలై నిజాంపేట, జేఎన్టీయూ, కేపీహెచ్‌బీ, మలేషియన్‌టౌన్‌షిప్, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి ఎక్స్‌రోడ్, గచ్చిబౌలి స్టేడియం, హెచ్‌సీయూ నుంచి విప్రో సర్కిల్‌మీదుగా వేవ్రాక్చేరుకుంటుంది. ఇందులోనూ 80 శాతం ఆక్యుపెన్సీ ఉండగా, మూడు బస్సులను నడుపుతున్నారు.
10హెచ్‌కు సంబంధించి రెండు బస్సులను నడుపుతుండగా ఒకటి రాణిగంజ్డిపో నుంచి బయలుదేరి సికింద్రాబాద్మీదుగా బేగంపేట్, అమీర్‌పేట్, యూసుఫ్‌గూడ ఎక్స్‌రోడ్, వెంకటగిరి, నవయుగ, పెద్దమ్మ గుడి, మాదాపూర్పీఎస్కొండాపూర్వెళ్తోంది. మరొకటి కొండాపూర్నుంచి మాదాపూర్, పెద్దమ్మ గుడి మీదుగా సేమ్రూట్లో సికింద్రాబాద్చేరుకుంటుంది. ఈ బస్సులోనూ 80 శాతం ఆక్యుపెన్సీ ఉంటోందని అధికారులు తెలిపారు.
290యులో 50 శాతమే..
హయత్ నగర్– సికింద్రాబాద్(290యు) రూట్లో బస్సులు హయత్‌నగర్ నుంచి మొదలై భాగ్యలత, పనామా, ఎల్బీనగర్, అల్కాపురి, నాగోల్, సర్వే ఆఫ్ ఇండియా, ఎన్జీఆర్ఐ, తార్నాక, ఆలుగడ్డబాయి మీదుగా సికింద్రాద్వరకు నడుస్తున్నాయి. ఈ బస్సుల్లో మాత్రం 50శాతం ఆక్యుపెన్సీనే ఉంటోందని అధికారులు తెలిపారు. ఈరూట్లో మూడు బస్సులు నడుస్తున్నాయి.