
యూకో బ్యాంకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్పెషలిస్ట్ క్యాడర్లో మొత్తం 20 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు ప్రక్రియ ఆగస్టు 29న ప్రారంభం కాగా అభ్యర్థులు సెప్టెంబర్ 18 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టు పేరు: మేనేజర్.
మొత్తం ఖాళీలు: 20
విభాగాల వారీగా ఖాళీలు: మేనేజర్- ఏఐ/ ఎంఎల్ ఇంజినీర్ 10, మేనేజర్ -– సైబర్ సెక్యూరిటీ 10.
ఎలిజిబిలిటీ
మేనేజర్- ఏఐ/ ఎంఎల్ ఇంజినీర్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి కనీసం 50 శాతం మార్కులతో కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఏఐ & ఎంఎల్ లేదా డేటా సైన్స్‌లో బీఈ/బీటెక్ లేదా ఎంసీఏ లేదా ఎంటెక్/ ఎంఈ పూర్తిచేసి ఉండాలి. కృత్రిమ మేధస్సు, జనరేటివ్ ఏఐ, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ లేదా మెషిన్ లెర్నింగ్ విభాగాల్లో సర్టిఫికెషన్ కలిగి ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. కనీసం 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
మేనేజర్ – సైబర్ సెక్యూరిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, సాప్ట్వేర్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్లో కనీసం 50 శాతం మార్కులతో బీటెక్/ బీఈ లేదా ఎంసీఏ లేదా ఎంటెక్/ ఎంఎస్సీ పూర్తిచేసి ఉండాలి. సైబర్ సెక్యూరిటీ లేదా ఐటీలో అడ్వాన్స్డ్ డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
కనీసం 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 2026, ఆగస్టు 1 నాటికి 25 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఆగస్టు 29.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలు రూ. 175, ఇతరులు రూ. 850 చెల్లించాలి.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 18.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్షతోపాటు స్క్రీనింగ్/ గ్రూప్ డిస్కషన్/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.uco.bank.inను సందర్శించండి.