Reading Time: < 1 minute

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్.. హైకోర్టులో కూటమి సర్కార్ కు ఊరట..!

Caption of Image.

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. డివిజన్లు, వార్డుల పునరావిభజనకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు తొలగిపోయాయి. ఈ ప్రక్రియను సవాల్ చేస్తూ విశాఖపట్నం సహా పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయితీల్లో దాఖలైన పిటిషన్లును కొట్టేసింది ఏపీ హైకోర్టు. దీంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది.

మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. గతంలో ఉన్న 3వేల 916 వార్డుల స్థానంలో కొత్తగా 4 వేల 843కి పెంచే ప్రక్రియను ప్రారంభించింది ప్రభుత్వం. అయితే.. ఈ ప్రక్రియపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలు ప్రాంతాల నుంచి హైకోర్టులో పిటిషన్లు పిటిషన్లు దాఖలయ్యాయి. సర్ ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో ఈ విభజన సరికాదంటూ పిటిషనర్లు అభిప్రాయపడటంతో గతంలో స్టే ఇచ్చింది హైకోర్టు.

►ALSO READ | సెప్టెంబర్ 15 నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు… పోలీసుల భారీ భద్రతా ఏర్పాట్లు…

అయితే.. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా ప్రభుత్వం హైకోర్టులో బలమైన వాదనలు వినిపించింది. నిబంధనల ప్రకారమే పునర్విభజన చేస్తున్నామని.. వార్డుల భౌగోళిక వైశాల్యంలో ఎలాంటి మార్పులు చేయడంలేదని స్పష్టం చేసింది ప్రభుత్వం. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు సదరు పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. 
 

©️ VIL Media Pvt Ltd.