Reading Time: < 1 minute

School holidays : విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..వరుసగా మూడు రోజులు సెలవులు.!

Caption of Image.

స్కూలు పిల్లలకు గుడ్‌న్యూస్‌.  ఈ సెప్టెంబర్ నెలలో  బ్యాక్ టూ బ్యాక్ లాంగ్ వీకెండ్స్ రావడంతో విద్యార్థులంతా పండగ చేసుకునే సమయం వచ్చేసింది.

రేపు సెప్టెంబర్ 4న శ్రీ కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని పాఠశాలలకు అధికారికంగా సెలవు కన్ఫర్మ్ అయింది. ఇక ఆ తర్వాత రోజు, సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం’ (టీచర్స్ డే). ఈ రోజు జనరల్ హాలిడే కాకపోయినా.. చాలా స్కూళ్లలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు, మరికొన్ని విద్యా సంస్థలు లోకల్ హాలిడేను ప్రకటిస్తాయి. ఇక సెప్టెంబర్ 6న ఆదివారం రావడంతో.. మొత్తానికి పిల్లలకు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చే అవకాశం ఉంది.

అంతేగాకుండా తర్వాతి వారం కూడా పిల్లలకు మరో ట్రీట్ సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 12న రెండో శనివారం, సెప్టెంబర్ 13న ఆదివారం, ఆ వెంటనే సెప్టెంబర్ 14న వినాయక చవితి పండుగ రానుంది. ఇలా ఈ సెప్టెంబర్ నెలలో వరుస సెలవులతో విద్యార్థులకు ఫుల్ జోష్ దక్కనుంది. మరి ఇంకెందుకు ఆలస్యం  ఈ లాంగ్ వీకెండ్స్‌లో ట్రిప్స్‌కి వెళ్లడానికి లేదా ఇంట్లో ఫ్యామిలీతో సరదాగా గడపడానికి పిల్లలు ఇప్పుడే ప్లాన్స్ వేసుకోండి.

©️ VIL Media Pvt Ltd.