Reading Time: 2 minutes
Bigg Boss 10 Telugu: ఆఖరు నిమిషంలో ట్విస్ట్.. బిగ్ బాస్‏లోకి టాలీవుడ్ తోపు విలన్.. ఇక రచ్చే..

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’. ఇప్పటివరకు తెలుగులో తొమ్మిది సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ షో.. ఇప్పుడు దశావతారం పేరుతో బిగ్ బాస్ తెలుగు 10 రాబోతుంది. ఇప్పుడు ఈ షో ప్రారంభానికి వేళయింది. మరికొన్ని రోజుల్లో ఈ గ్రాండ్ షో షురూ కానుండటంతో, ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టబోయే సెలబ్రిటీలు, కంటెస్టెంట్లు ఎవరనే దానిపై సర్వత్రా తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇప్పటికే సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ కంటెస్టెంట్ల పేర్లపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో క్రేజీ నటుడి పేరు తెరపైకి వచ్చింది. ఎన్నో సినిమాల్లో విలన్‌గా, సహాయ నటుడిగా మెప్పించిన ప్రముఖ నటుడు ‘టెంపర్’ వంశీ కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లబోతున్నారని పరిశ్రమలో గట్టిగా ప్రచారం జరుగుతోంది.

ఎక్కువ మంది చదివినవి : Yeshanagula : . ఈ పాటలో ఇంత అర్ధం ఉందా.. ఏశనాగుల కట్ట మీద సాంగ్ లిరిక్స్‏కు అర్థం ఇదే..

వంశీ అసలు పేరు అజయ్. సినీ పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఆయన, మొదట్లో జూనియర్ ఆర్టిస్ట్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన బ్లాక్‌బస్టర్ హిట్ సినిమా ‘టెంపర్’లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ చిత్రం తర్వాత ఆయన ‘టెంపర్’ వంశీగా ప్రాచుర్యం పొందారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో విలన్‌గా, ప్రతికూల పాత్రల్లో వరుసగా నటిస్తూ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : 2026లోనే అట్టర్ ప్లాప్.. ఓటీటీలోకి వచ్చిన వెంటనే ట్రెండింగ్ నంబర్ వన్.. ఏ మూవీ అంటే..

ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించే కంటెస్టెంట్ల జాబితాలో పలువురు ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. ఎక్స్‌ప్రెస్ హరి, ఆటో రామ్ ప్రసాద్, నూకరాజు, రాకింగ్ రాకేష్, డ్యాన్సర్ ఆట సందీప్ భార్య జ్యోతి, యూట్యూబర్ నందూ, రచయిత కడలి సత్యనారాయణ తదితరులు ఉన్నారని ప్రచారం సాగుతోంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంచ్ సెప్టెంబర్ 6న సాయంత్రం 7 గంటలకు టెలికాస్ట్ కానుంది. ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లోనే హౌస్‌లోకి వెళ్లే అసలైన కంటెస్టెంట్లు ఎవరనేది అధికారికంగా స్పష్టం కానుంది.

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ సినిమాతోనే నా జీవితం మలుపు తిరిగింది.. ఆయన మూవీ అప్పట్లో సంచలనం.. తనికెళ్ల భరణి.

టెంపర్ వంశీ..

 

View this post on Instagram

 

A post shared by AJHEY 🔱 (@temper_vamsi)

ఎక్కువ మంది చదివినవి : Cinema : సినిమా అంటే ఇది భయ్యా.. ఒక్క దెబ్బతో టాక్సిక్, దురంధర్ చిత్రాలు వెనక్కు.. థియేటర్లను షేక్ చేస్తున్న మూవీ..