Reading Time: < 1 minute

సైదాబాద్ ఫ్లై ఓవర్ను ప్రారంభించిన సీఎం.. ఈ ఏడు ఏరియాల పబ్లిక్కు ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే !

Caption of Image.

హైదరాబాద్: పాత బస్తీ ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు నిర్మించిన సైదాబాద్ ఫ్లై ఓవర్ను సీఎం రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. చంచల్‌గూడ ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ నుంచి సంతోష్‌నగర్ వరకు రూ.620 కోట్లతో 3.2 కిలోమీటర్ల పొడవు,16.6 మీటర్ల వెడల్పుతో నాలుగు లేన్లుగా ఈ ఫ్లై ఓవర్ను నిర్మించారు. ఇందులో భూసేకరణకు రూ.153.37 కోట్లు ఖర్చు చేశారు.

ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంతో సైదాబాద్, సంతోష్‌నగర్, చంచల్‌గూడ, ఐఎస్‌సదన్, చంపాపేట్, కంచన్‌బాగ్, మలక్‌పేట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఇది హైదరాబాద్లో మూడో అతిపెద్ద ఫ్లై ఓవర్గా రికార్డుల్లోకి ఎక్కింది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు సుమారు ఆరేండ్లపాటు కొనసాగాయి.

►ALSO READ | హాట్ టాపిక్గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫ్లెక్సీ.. ఈ ఫ్లెక్సీలో ఏముందంటే..

2009లో పీవీ ఎక్స్‌ప్రెస్ వే దేశంలోనే అతి పొడవైన ఫ్లైఓవర్​గా రికార్డును సొంతం చేసుకుంది. దీన్ని11.66 కిలోమీటర్ల పొడవుతో నాలుగు లైన్లుగా నిర్మించారు. సిటీ నుంచి శంషాబాద్​ ఎయిర్​పోర్టుకు వెళ్లే వారికి ట్రాఫిక్​సమస్య లేకుండా దీన్ని నిర్మించారు. ఇక.. ఆరాంఘర్ ఫ్లైఓవర్ 4.08 కిలోమీటర్ల పొడవుతో రెండో స్థానంలో ఉంది. గతేడాది జనవరిలో ఇది అందుబాటులోకి వచ్చింది.

©️ VIL Media Pvt Ltd.