ద్వాపర యుగంలో అధర్మాన్ని అణచివేసి ధర్మాన్ని రక్షించడానికి శ్రీమహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించాడు. “సంభవామి యుగే యుగే” అంటూ ధర్మసంస్థాపన కోసం తాను ఎప్పుడూ ఉంటానని భగవద్గీతలో చెప్పిన ఆ మురళీధరుడు ప్రదర్శించిన అద్భుతాలు ఎన్నో. కృష్ణాష్టమి సందర్భంగా లోక కళ్యాణం కోసం, తన వారిని కాపాడుకోవడం కోసం శ్రీకృష్ణుడు చూపిన 4 అద్భుతమైన లీలల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
గోవర్ధన గిరిధారి: ప్రకృతికి అద్దం పట్టిన లీల: దేవేంద్రుడి అహంకారాన్ని అణచడానికి కృష్ణుడు ఇంద్రుడి పూజలు నిలిపివేయించాడు. దాంతో ఆగ్రహించిన ఇంద్రుడు బృందావనంపై భయంకరమైన వర్షం కురిపించగా, కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలితో గొడుగులా పైకి లేపాడు. ఇక ఏడు రోజుల పాటు పశువులను, ప్రజలను కాపాడి ప్రకృతిని గౌరవించడమే అసలైన ధర్మమని నిరూపించాడు.

కాళీయ మర్దనం: కాలుష్యం పై విజయం: యమునా నదిని విషపూరితం చేస్తూ జీవుల ప్రాణాలు తీస్తున్న కాళీయుడు అనే సర్పంపై కృష్ణుడు తాండవం చేశాడు. ఇక నదిలోకి దూకి కాళీయుడి వంద పడగలపై నాట్యం చేస్తూ అతడి గర్వాన్ని అనచాడు. నదిని కాలుష్య రహితంగా మార్చి సమాజానికి హాని చేసే శక్తులను ఎలా ఎదుర్కొవాలో చాటిచెప్పాడు.
ద్రౌపదీ వస్త్రాపహరణం: స్త్రీ మాన రక్షణ: కురుసభలో ద్రౌపదికి అవమానం జరుగుతున్నప్పుడు, కౌరవుల అన్యాయాన్ని అడ్డుకుంటూ కృష్ణుడు అక్షయమైన వస్త్రాలను ప్రసాదించి ఆమె మానాన్ని కాపాడాడు.ఇక పెద్దలందరూ నిస్సహాయంగా ఉండిపోయిన వేళ, స్త్రీ గౌరవాన్ని కాపాడటానికి భగవంతుడు ఏ రూపంలోనైనా వస్తాడని ఈ లీల ద్వారా స్పష్టం చేశాడు.
సూర్యాస్తమయం భ్రమ: అర్జునుడి ప్రతిజ్ఞా రక్షణ: అభిమన్యుడి మరణానికి కారణమైన జయద్రథుడిని చంపుతానని అర్జునుడు చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చడానికి కృష్ణుడు తన సుదర్శన చక్రంతో సూర్యుడిని కప్పివేశాడు. ఇక చీకటి పడిందని జయద్రథుడు బయటకు రాగానే చక్రాన్ని తొలగించి, అర్జునుడి చేత అతడిని వధింపజేసి ధర్మ పక్షాన ఉన్నవారి ప్రాణాలను నిలిపాడు.
శ్రీకృష్ణుడి ఈ లీలలు కేవలం కథలు మాత్రమే కావు. సమాజంలో అన్యాయం, అక్రమాలు పెరిగినప్పుడు ధర్మాన్ని, ప్రకృతిని మరియు స్త్రీ గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియజేసే గొప్ప పాఠాలు.
గమనిక: భగవద్గీత మరియు పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడి ప్రతి లీల వెనుక మానవాళికి ఉపయోగపడే ఒక లోతైన ధర్మ సందేశం దాగి ఉంది.
The post ధర్మ రక్షణ కోసం శ్రీకృష్ణుడి అద్భుతాలు.. ఈ 4 లీలలు తెలిస్తే ఆశ్చర్యపోతారు! appeared first on Manalokam – Latest Telugu News & Updates.