Reading Time: < 1 minute

బీజేపీ గుండా రాజకీయాలను ప్రోత్సహిస్తోంది : ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

Caption of Image.

యాదాద్రి వెలుగు : ఢిల్లీ నుంచి అమిత్ షా డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో బండి సంజయ్, బీజేపీ నాయకులు గుండా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆరోపించారు. బుధవారం భువనగిరి  క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే  మాట్లాడుతూ క్యాంప్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌పై మారణాయుధాలతో దాడి చేయడం హేయమైన చర్యని, ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా మండిపడ్డారు. 

రాజకీయాల్లో ప్రత్యర్థులపై నిర్మాణాత్మక విమర్శలు చేయాలి తప్ప దాడులు, హింసకు పాల్పడటం సరికాదని,  తమ సంయమనాన్ని బలహీనతగా భావిస్తే గట్టిగా సమాధానం చెబుతామని హెచ్చరించారు. తెలంగాణలో 1000 రోజుల దగా అంటూ బీఆర్ఎస్ కొత్త రాజకీయ నాటకాలకు తెరతీస్తోందని, కేసీఆర్ ఒక్క రోజు కూడా అసెంబ్లీకి రాకుండా ప్రజా సమస్యలకు దూరంగా ఉంటూ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.  మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి-రవికుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేస్ చిస్తి, పట్టణ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.