Reading Time: < 1 minute

జీడీపీ బొమ్మను మెరిపించొచ్చు.. ఆర్థిక వ్యవస్థను కాదు..బీజేపీ సర్కారుపై కాంగ్రెస్ నేతల విమర్శలు

Caption of Image.

జీడీపీ వెనుక పీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాయాజాలం

న్యూఢిల్లీ:  కేంద్ర ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న దేశ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) లెక్కల వెనుక భారీ మాయాజాలం దాగుందని కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.  పీఆర్ ప్రచార ఆర్భాటాలతో జీడీపీకి రంగులద్ది చూపించగలరేమో కానీ, చితికిపోతున్న ఆర్థిక వ్యవస్థను బాగుచేయలేరని వ్యాఖ్యానించింది.

 గతంలో ప్రధాని మోదీ హయాంలోనే ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా పనిచేసిన సుభాష్ చంద్ర గార్గ్ చేసిన వ్యాఖ్యలను ప్రధాన అస్త్రంగా చేసుకొని కాంగ్రెస్ కేంద్రంపై విమర్శలు చేసింది. గత ఆర్థిక సంవత్సరం జీడీపీ గణాంకాలను  రూ.6 లక్షల కోట్ల మేర కృత్రిమంగా తగ్గించడం వల్లే ప్రస్తుత త్రైమాసిక వృద్ధి రేటు 10.3 శాతానికి ఎగబాకినట్టు  కనిపిస్తోందని గార్గ్ ఓ మీడియా ఇంటర్వ్యూలో చెప్పారు. పాత లెక్కలను కిందకు దింపకపోతే ప్రస్తుత ధరల ప్రకారం అసలైన వృద్ధి రేటు కేవలం 2.6 శాతానికే పరిమితమయ్యేదని ఆయన బట్టబయలు చేశారు. 

అబద్ధాలకు రంగులద్దొద్దు.. 

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేత జైరాం రమేశ్‌‌‌‌‌‌‌‌ ‘ఎక్స్‌‌‌‌‌‌‌‌’ వేదికగా కేంద్రంపై నిప్పులు చెరిగారు.‘‘ప్రభుత్వం చెప్పుకుంటున్న 7.8 శాతం వృద్ధి పచ్చి అబద్ధం. క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులకు, ఈ దొంగ లెక్కలకు పొంతనే లేదు. అబద్ధాల పునాదులపై అంకెలను అందంగా అలంకరించినంత మాత్రాన వ్యవస్థ బలోపేతం కాదు. 

మోదీ జీడీపీ లెక్కలతో దీపావళి బాణసంచా కాల్చుకోమంటున్నారు.. కానీ ఆయన హయాంలో పనిచేసిన మాజీ ఆర్థిక కార్యదర్శే ఈ బుడగను పేల్చేశారు”అని ఎద్దేవా చేశారు. సంపన్నులకు ఊడిగం చేయడం మానేసి నిరుద్యోగం, తగ్గిపోతున్న ప్రజల కొనుగోలు శక్తి, సంక్షోభంలో ఉన్న ఎంఎస్ఎంఈలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.

కేంద్రం సమాధానం చెప్పాలి.. 

కాంగ్రెస్ నేత పవన్ ఖేరా కూడా కేంద్రం తీరును  ఎండగట్టారు. నిత్యావసరాల ధరలు పెరిగి కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్న వేళ.. గార్గ్ చెప్పిన 2.6 శాతం వృద్ధే నేటి చేదు నిజమన్నారు. నిరుడు జీడీపీని ఎందుకు తగ్గించాల్సి వచ్చిందో  కేంద్రం  సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలో ‘మేకిన్ ఇండియా’ పక్కకుపోయి.. మోదీ ‘ఫేక్ ఇన్ ఇండియా’ పథకం జోరుగా సాగుతోందన్నారు.  

©️ VIL Media Pvt Ltd.