Reading Time: < 1 minute

పాకిస్తానీ భార్యకు విడాకులు ఇస్తున్నా.. నా ఉరి శిక్షను పరిశీలించండి

Caption of Image.

తిహార్ జైలులో శిక్షణ అనుభవిస్తున్న నిషేధిత ఉగ్రవాద గ్రూప్ జమ్మూకాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(JKLF )చీఫ్ యాసిన్ మాలిక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకు ఉరిశిక్ష అమలు చేయాలని కోర్టు కోరారు. కేసు విచారణలో తాను వాదించబోనని కూడా వెల్లడించారు. మరోవైపు పాకిస్తాన్ లో ఉన్న తన భార్య ముషాల్ హుస్సేన్ మాలిక్ కు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించారు. 
2019 నుంచి కాశ్మీరీ పండిట్ నర్సు సరళా భట్ హత్యకేసులో తిహార్ జైలులో  మాలిక్ శిక్ష అనుభవిస్తున్నారు. ఈ కేసుకలో తన న్యాయవాది అబు ఆదిల్ పండిట్ ద్వారా బుధవారం శ్రీనగర్‌లోని అదనపు సెషన్స్ కోర్టులో 25 పేజీల లిఖితపూర్వక వాంగ్మూలాన్ని దాఖలు చేశారు.  

 నేను ఇకపై విచారణను వ్యతిరేకించను..నాకు మరణశిక్ష  విధించవచ్చు అని మాలిక్ కోర్టుకు తెలిపారు. అయితే నేరాన్ని అంగీకరించినట్లు కాదని స్పష్టం చేశారు. రాజకీయ కారణంతోనే తనను ఈ కేసులో ఇరికించారని యాసిన్ మాలిక్ కోర్టుకు తెలిపారు. సెప్టెంబర్19న విచారణ జరగనుంది. 

©️ VIL Media Pvt Ltd.