Reading Time: < 1 minute

భార్యను స్కూల్ నుంచి తీసేశారని.. సాంబార్లో పేడ కలిపాడు!

Caption of Image.

బడిపిల్లలు తినే సాంబార్లో ఎవరైనా పేడ కలుపుతారా..? ఒక వేళ అలా చేశారంటే వాళ్లను ఏమనాలి..? తన భార్యను స్కూల్ నుంచి తొలగించారని ఇంత నీచమైన  పని చేశాడు ఈ దుర్మార్గుడు. తమిళనాడులో జరిగిన ఈ ఘటన గురించి చూసిన అందరూ వీడూ వీని శాడిజం అంటూ సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్నారు. 

తమిళనాడు ఈరోడ్ జిల్లాలో విద్యార్థులు తినే సాంబార్ లో పేడ కలపడం కలకలం రేపింది. ప్రభుత్వం అందిస్తున్న ఫ్రీ బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ద్వారా విద్యార్థులకు చేసిన టిఫిల్ లో పేడ పొడిని కలిపింది అరుముగం అని గుర్తించారు. 2026 ఆగస్టు 29 న జరిగిన ఈ ఘటనలో ఆరుముగం ను అరెస్టు చేశారు. 

అరుముగం భార్య అదే స్కూళ్లో వంట మనిషిగా పనిచేసేది. ఇటీవల ఆమెను జాబ్ నుంచి తొలగించారు. వంట నాణ్యత పాటించడం లేదని, శుభ్రత గాలికొదిలేసి పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని ఆమెను తొలగించారు. దీంతో కక్ష్య పెంచుకున్న అరుముగం..  ఈ నీచమైన పని చేశాడు. 

స్కూల్ హెడ్ మాస్టర్ పిర్యాదుతో పోలీసులు అరుముగం ను అరెస్టు చేశారు. 

సాంబార్ చేదు చేదు ..

ఎప్పటి లాగే పిల్లలకు వడ్డించే ముందు వంటలు బాగున్నాయా లేదా అని పరీక్షించిన టీచర్లు.. సాంబార్ చేదుగా ఉండటం చూసి డౌట్ వచ్చింది. అయితే మొదట సాంబార్ లో పసుపు ఎక్కువైందని భావించారు. 

అయితే సాంబార్ లో కలిపిన పేడ పౌడర్ అక్కడే పడి ఉండటం చూసి పేడ కలిపినట్లు అనుమానం వచ్చింది. దీంతో విచారించగా పేడ కలిపినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేశారు. 

©️ VIL Media Pvt Ltd.