Reading Time: 4 minutes

జ్యోతిష్యం:సింహరాశిలో త్రిగ్రాహి యోగం..బుధాదిత్య రాజయోగం..మూడు రాశుల వారికి దిమ్మతిరిగే లాభాల మూట..!

Caption of Image.

సెప్టెంబర్​ నెలలో కీలక గ్రహాల్లో మార్పులు సంభవిస్తున్నాయి.కృష్ణాష్టమి.. పవిత్రమైన రోజున   అంటే 2026 సెప్టెంబర్​ 4న సింహరాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఒకే రాశిలో  సూర్యుడు, బుధుడు, కేతువు సంచారం జరగునుంది.  సింహరాశిలో సూర్యుడు, బుధుడు ఉండటం వలన చాలా  శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. దీని ప్రభావంతం మూడు రాశుల వారికి ( మిథున, తుల, వృశ్చిక) రాశుల వారికి దిమ్మతిరిగే లాభాలుంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

మేష రాశి: సూర్యుడు.. బుధుడు … ఈ  రెండు గ్రహాలు సింభ రాశిలో కలవడం.. త్రిగ్రాహి యోగం  వలన ఈ రాశి  వారికి  ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక లాభాలు ఉంటాయి. వృత్తిలో కొన్ని ఆటంకాలు ఏర్పడినా..  కొత్త అవకాశాలు ఏర్పడతాయి. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు పొందుతారు వృత్తి, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలుంటాయి.  అయితే ఆర్ధిక వ్యవహారాలు స్వల్ప మార్పులు చోటు చేసుకొని కొద్ది మొత్తం మేరకు బ్యాంక్ బాలెన్స్ పెరిగే అవకాశం ఉంది. కాని ఇతరులతో వాగ్వాదం పెట్టుకోవద్దు.  ప్రత్యర్థులు మీపై ఆధిపత్యం చెలయించే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

వృషభరాశి:  సింహరాశిలో త్రిగ్రాహి యోగం.. బుధాదిత్య రాజయోగం వలన ఈ రాశి వారు అతి కష్టంతో  పురోగతి.. విజయాన్ని సాధిస్తారు.   కెరీర్ లో  అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఒడిదుడికులతో ప్రమోషన్, కొత్త అవకాశాలు లభిస్తాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించేందుకు  ఈ సమయం అనుకూలం లేదు. వ్యాపారస్తులకు నష్టాలు లేకపోయినా.. లాభాలు రావు.  కొత్తగా పెట్టుబడులుపెట్టకపోవడమే మంచిది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.

మిథున రాశి: సింహరాశితో బుధాదిత్య యోగ్ం వలన ఈ రాశి వారికి సమాజంలో కీర్తి.. గౌరవం.. ప్రతిష్ఠ పెరుగుతుంది. కొత్తగా ఆదాయ మార్గాలు ఏర్పడంతో .. ఇబ్బందులు తీరుతాయి.  కొన్ని కొత్త వనరులు ఏర్పడుతాయి.  కొత్త ఆలోచనలతో తీసుకున్న నిర్ణయాలు.. కొత్త ప్రణాళికలు కలసి వస్తాయి.  ఉద్యోగస్తులకు అధికారుల మద్దతు పుష్కలంగా ఉంటుంది.  ప్రమోషన్ రావడం.. వేతనం పెరగడం … కొన్ని కొత్త బాధ్యతలు తీసుకోవలసి వస్తుంది.  వ్యాపారస్తులకు అన్ని విధాల కలసి వస్తుంది.  అనుకోకుండా లాభాలు వస్తాయి.  కొత్త పెట్టుబడులు పెట్టే వారు ఊహించని లాభాలు పొందుతారు.  కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంటుంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఒక శుభవార్త మీ ఇంటి తపుడు తడుతుంది. 

కర్కాటక రాశి: సింహరాశిలో బుధాదిత్య  రాజయోగం వల్ల వ్యక్తి ఆనందం, శ్రేయస్సు, సమృద్ధి అందిస్తుంది. ఫలితంగా   కొత్త పనులు శ్రీకారం చుట్టేందుకు అనువైన కాలం. ప్రతి పనిని శ్రద్ధగా చేయడం వల్ల విజయం సాధిస్తారు. తోబుట్టువులతో సంబంధం బలపడుతుంది. కెరీర్ మెరుగుదల కోసం మీరు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభిస్తే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే అవకాశం పొందుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం లభిస్తుంది.

సింహరాశి: ఇదే రాశిలో బుధాదిత్యయోగం.. త్రిగ్రాహి యోగం ఏర్పడటం వలన ఈ రాశి వారికి చాలా   సంతృప్తి కరంగా ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి మంచి సమయం.  ఉద్యోగస్తులు సహోద్యోగుల నుంచి  ప్రశంసలు అందుకుంటారు. బదిలీ కోసం ప్రయత్నిస్తుంటే .. అనుకున్న ఫలితాన్ని పొందుతారు.  ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  వ్యాపారస్తులు అధిక లాభాలు గడించే అవకాశం ఉంది. అయితే శని .. రాహు గోచారం బాగుండదు కాబట్టి ఎముకలు . గ్యాస్ట్రిక్ సంబంధ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆహార విషయంలో జాగ్రత్త అవసరమని పండితులు సూచిస్తున్నారు.

కన్యా రాశి:  సింహరాశిలో మూడు గ్రహాలు సంచారం వలన ఈ రాశి  వారికి అనుకూలమైన ఫలితాలుంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చినట్టే వచ్చి చేజారుతుంది.  అయినా వీరు చేసే పనిలో మీరే కీలకంగా వ్యవహరిస్తారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారు విజయం సాధిస్తారు. మానసిక ఒత్తిడి వలన ఆరోగ్యంకొంత దెబ్బతినే అవకాశం ఉంది. కొన్ని విషయాలకు కాలమే పరిష్కారం చూపుతుందని మనో నిబ్బరంగా ఉండండి.  ఆర్దికంగా కొంత వృద్ది చెందినా అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.

తులారాశి: సింహరాశిలో త్రిగ్రాహి యోగం వలన ఈ రాశి వారికి చాలా  అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఉద్యోగస్తులకు  ఉన్నత పదవులు, వేతన పెరిగే అవకాశాలున్నాయి.  ముఖ్యంగా కీలకమైన నిర్ణయాలు తీసుకునేఅవకాశం ఉంది.  శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. అనుకోని పరిస్థితుల వలన కొంతకాలం వేరే ప్రదేశంలో పరిచేయాల్సి రావచ్చు.  కార్యాలయంలో సహోద్యోగులు, పై అధికారుల మద్దతు ఉంటుంది. అధిక పని వలన కొంత చికాకు ఏర్పడుతుంది.  ఎవరితోనూ వాదన పెట్టుకోకుండా మీ పని మీరు చేయండి.  ఫలితం దానికదే వస్తుంది. ఆరోగ్యంగా కొంత ఇబ్బంది ఏర్పడుతుంది.  ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది.  స్థిరాస్థులు వృద్ది చెందే అవకాశం కలదు. సమస్యలు వచ్చినప్పటికీ ఉత్సాహం తగ్గకుండా పనిచేయడంతో అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు.

వృశ్చిక రాశి: కృష్ణాష్టమి వేళ త్రిగ్రాహి యోగం వలన ఈ రాశి వారికి ఊహించని లాభాలు కలుగుతాయి.  వృత్తి.. ఉద్యోగం.. వ్యాపారంలో  పురోగతి ఉంటుంది.  ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలతో పాటు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.  మేషరాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు అనుకోకుండా ఏర్పడటంతో సంపద పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.  వ్యాపారస్తులు అధికంగా లాభాలు గడిస్తారు.  కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడటం వలన వ్యాపారం విస్తరించే అవకాశం ఉంది.  కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. 

ధనుస్సు రాశి : సింహరాశిలో.. కేతువు, బుధుడు, సూర్యుడు కలిసి సంచారం చేయడం వలన ఈ రాశి వారికి  మిశ్రమ ఫలితాలుంటాయి. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారంగా  ఆర్థికంగా …  కెరీర్ పరంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది.  ఉద్యోగస్తులు..  మీరు చేయని పనికి కూడా పై అధికారులు అపార్దం చేసుకునే అవకాశాలున్నాయి.  ఎవరితోనూ ఎక్కువుగా మాట్లడకండి… ఎవరికి ఎలాంటి వాగ్డానాలు ఇవ్వవద్దు.    . మీరు చేపట్టే ప్రతి పనిలో  ఆలస్యం .. అడ్డంకులు వస్తాయి. ఆశించిన ఫలితాన్ని పొందడానికి మీరు చాలా కష్టపడాలి. బుధుని గోచారం అనుకూలంగా ఉన్నప్పటికీ ఎనిమిదవ ఇంటిలో కేతువు సంచారం కారణంగా పరీక్షల్లో తొందరపాటు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. వీలైనంతవరకు ఓపికగా ప్రశాంతంగా పరీక్షలు రాయడం మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.

మకర రాశి: సింహరాశిలో త్రిగ్రాహియోగం వలన ఈ రాశి వారికి సామాన్య ఫలితాలుంటాయి.  ప్రతి విషయంలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.  కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూసే వారు శుభవార్తలు వినే అవకాశం ఉంది.   ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు.   మీరు చేయాలనుకునే పనిలో స్వల్ప ఆటంకాలు వస్తాయి.  నిరుత్సాహ పడకుండా.. ముందుకు సాగండి. కొత్త వెంచర్లు ప్రారంభించాలకునేవారు.. ముందుగా దైవ దర్శనం చేసుకొని ఆ తరువాత ప్రారంభింజ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

కుంభ రాశి: సూర్యుడు, బుధుడు, కేతువు సింహరాశిలో  సంచరించే సమయంలో  అధికంగా కష్టపడాల్సి ఉంటుంది.  శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. అనుకోని పరిస్థితుల వలన కొంతకాలం వేరే ప్రదేశంలో పరిచేయాల్సి రావచ్చు.  కార్యాలయంలో సహోద్యోగులు, పై అధికారుల మద్దతు ఉంటుంది. అధిక పని వలన కొంత చికాకు ఏర్పడుతుంది.  ఎవరితోనూ వాదన పెట్టుకోకుండా మీ పని మీరు చేయండి.  ఫలితం దానికదే వస్తుంది. ఆరోగ్యంగా కొంత ఇబ్బంది ఏర్పడుతుంది.  ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది.  స్థిరాస్థులు వృద్ది చెందే అవకాశం కలదు. సమస్యలు వచ్చినప్పటికీ ఉత్సాహం తగ్గకుండా పనిచేయడంతో అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు.

మీన రాశి : ఈ రాశివారికి సింహరాశిలో త్రిగ్రాహి యోగం వలన మిశ్రమ ఫలితాలుంటాయి.  ఉద్యోగస్తులకు ప్రమోషన్​పొందే అవకాశం ఉంటుంది.  పనిభారంతోపాటు అదనపు బాధ్యతలను నిర్వహించవలసి ఉంటుంది. కష్టానికి తగిన గుర్తింపు వస్తుంది.  కుటుంబ విషయాల కారణంగా అనవసరంగా డబ్బు ఖర్చయ్యే అవకాశం ఉంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ నెలలో సానుకూల ఫలితం ఉంటుంది. మీరు మీ స్నేహితులతో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశానికి కూడా ప్రయాణం చేయవచ్చు. వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన సమయం,  సంపాదనలో మెరుగైన వృద్ధిని మరియు ఊహించని డబ్బు ను పొందుతారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

©️ VIL Media Pvt Ltd.