
దేశంలో ఎక్కుమంది కస్టమర్లు కలిగి ఉన్న బ్యాంక్‌గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు గాంచింది. ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులో కోట్లాదిమంది దేశవ్యాప్తంగా ఖాతాలు కలిగి ఉన్నారు. దీంతో ఎస్బీఐ సేవల్లో ఏవైనా అంతరాయం కలిగితే దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు ప్రభావితం అవుతారు. ఈ క్రమంలో ఎస్బీఐ తమ ఖాతాదారులకు పెద్ద అలర్ట్ ఒకటి జారీ చేసింది. సెప్టెంబర్ 4వ తేదీన ఎస్బీఐ ఖాతాదారులకు యూపీఐ సేవలు బంద్ కానున్నాయి. సాంకేతిక కారణాల వల్ల ఆ రోజు కొన్ని గంటల పాటు యూపీఐ సేవలు నిలిచిపోనున్నాయి. దీంతో ఖాతాదారులు దీనిని గమనించాలని ఎస్బీఐ అలర్ట్ జారీ చేసింది. సెప్టెంబర్ 4న అర్థరాత్రి 00.15 గంటల నుంచి 01.00 గంటల వరకు యూపీఐ సేవలు ప్రభావితం కానున్నాయి.
45 నిమిషాల పాటు బంద్
45 నిమిషాల పాటు ఎస్బీఐ ఖాతాదారులు యూపీఐ సేవల్లో అంతరాయం ఎదుర్కొనున్నారు. ఈ సమయంలో యూపీఐ యాప్స్‌లో ఎస్బీఐ ఖాతా ద్వారా పేమెంట్స్ చేయలేరు. కేవలం యూపీఐ పేమెంట్స్ మాత్రమే నిలిచిపోనున్నాయి. ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ ద్వారా యథావిధిగా ఖాతాదారులు చెల్లింపులు చేసుకోవచ్చు. షెడ్యూల్డ్ పనుల కారణంగా యూపీఐ సేవలను కొద్ది నిమిషాల పాటు ఆపివేస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. ఈ సమయంలో నగదు బదిలీ చేసుకోవాలంటే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించింది. అయితే యూపీఐ లైట్ సేవలు మాత్రమే సాధారణంగా పనిచేస్తాయి. దీంతో యూపీఐ లైట్ ద్వారా ఖాతాదారులు సలుభంగా పేమెంట్స్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్రక్రియ నిర్ణీత సమయం కంటే ముందే పూర్తయ్యే అవకాశముందని ఎస్బీఐ తన ఎక్స్ ఖాతాలో పొందుపర్చింది. ఈ సమయంలో కస్టమర్లు యూపీఐ లైట్ సర్వీసులను వాడాలని సూచించింది. అయితే యూపీఐ సేవలు నిలిచిపోయేది అర్థరాత్రి కావడంతో పెద్దగా ఖాతాదారులపై ప్రభావం ఉండదని చెప్పుకోవచ్చు. రాత్రుల్లో తక్కువగా యూపీఐ లావాదేవీలు జరుగుతాయి. దీంతో ఆ సమయాల్లోనే బ్యాంకులు నిర్వహణ పనులు చేపడుతూ ఉంటాయి.
యూపీఐ లైట్ ద్వారా ఎంత పంచుకోవచ్చు..?
యూపీఐ లైట్ ఫీచర్ ద్వారా గరిష్టంగా రూ.5 వేల పరిమితి ఉంది. పిన్ అవసరం లేకుండా రూ.వెయ్యి వెంటనే పంచుకోవచ్చు. ఒకరోజుకు 20 ట్రాన్సాక్షన్ల లిమిట్ ఉంది. రోజుకు రూ.లక్ష వరకు యూపీఐ ద్వారా పంపుకోవచ్చు. వైద్య, విద్య, ట్యాక్స్ పేమెంట్స్, ఇన్యూరెన్స్, క్యాపిటల్ మార్కెట్లకు రూ.5 లక్షల వరకు పంపుకోవచ్చు. ఈ మేరకు ఆర్బీఐ కొన్ని నిబంధనలు విధించింది. నెఫ్ట్, ఆర్టీజీఎస్ ద్వారా పెద్ద మొత్తంలో లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. దీంతో కేవలం చిన్న పేమెంట్స్‌కు మాత్రమే యూపీఐ వాడాలి.
Due to scheduled maintenance activity, SBI UPI services will be temporarily unavailable from 00:15 hrs to 01:00 hrs on 04.09.2026 (IST). The activity may, however, be completed early. Customers may continue to use UPI Lite Services for uninterrupted service. We regret the…
— State Bank of India (@TheOfficialSBI) September 2, 2026