
బిల్లు కట్టకుండా అక్కడి నుంచి పరారయ్యేందుకు సదరు యువతి ప్రయత్నించగా బార్ సిబ్బంది ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా అక్కడికక్కడే వింత రాజీ కుదుర్చుకున్నారు. డబ్బులకు బదులుగా ఆమె జుట్టును విక్రయించే ఒక ‘హెయిర్ పర్చేజ్ కాంట్రాక్ట్’ ఒప్పందానికి ఆమె అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వెంటనే రంగంలోకి దిగిన బార్‌టెండర్, ఎలక్ట్రిక్ రేజర్‌ను తీసుకుని ఆమె భుజాల వరకు ఉన్న దట్టమైన, పొడవాటి జుట్టును పూర్తిగా తొలగించి ఆమెకు గుండు కొట్టించినట్లు న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రచురించింది.
ఆ కత్తిరించిన జుట్టును విరాళంగా ఇవ్వనున్నట్లు బార్ సిబ్బంది తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి తీవ్ర చర్చకు దారి తీసింది. బార్ సిబ్బంది వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. థాయ్‌లాండ్‌కు చెందిన ‘బీ వన్ ఫౌండేషన్’ వ్యవస్థాపకురాలు చాలిదా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఆగ్రహంతో మేనేజర్ ఈ పని చేశారని, మహిళ కుటుంబ సభ్యులతో మాట్లాడి నష్టపరిహారం చెల్లించేందుకు బార్ యాజమాన్యం సిద్ధపడిందని ఆమె తెలిపారు. తీవ్ర ఒత్తిడితో కుదుర్చుకున్న ఒప్పందాలు చట్టబద్ధం కావని అన్నారు. ఈ అంశంపై థాయ్‌లాండ్ సామాజిక అభివృద్ధి, మానవ భద్రతా మంత్రిత్వశాఖ విచారణకు ఆదేశించింది.
సోషల్ మీడియాలో తీవ్ర దుమారం
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి తీవ్ర చర్చకు దిగారు. క్రిమినల్ కేసులను ఎదుర్కొనే కంటే ఆమెకు అదే నయమని కొందరు వాదించగా, మరికొందరు మాత్రం బార్ సిబ్బంది చర్యను తీవ్రంగా తప్పుబట్టారు. “బార్ సిబ్బందికి ఇలాంటి కేసులతో డీల్ చేయడం అలవాటు ఉన్నట్లు ఉంది. ఆమె ఒంటిపై ఎలాంటి బంగారం లేకపోవడంతో, చివరికి ఆమె విలువైన జుట్టునే తీసేసుకున్నారు” అని మరొకరు సెటైర్ వేశారు. “పోలీసులకు ఎందుకు ఫోన్ చేయలేదు? వారితోనే ఈ వ్యవహారం తేల్చుకోవచ్చుగా? దీనిని నేను పూర్తిగా దాడిగా భావిస్తున్నాను” అంటూ పోలీసులు రంగంలోకి దిగాల్సిందని మూడో వ్యక్తి అభిప్రాయపడ్డారు.