Reading Time: 3 minutes

I’m Game Review: యాక్షన్ థ్రిల్లర్‌ ‘ఐ యామ్ గేమ్’ రివ్యూ: దుల్కర్ ఖాతాలో హిట్ పడినట్టేనా? పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

Caption of Image.

మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్‌లోనూ భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. లేటెస్ట్ గా ఆయన నటించిన  మోస్ట్ అవేటెడ్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ యామ్ గేమ్’ (I’m Game). ‘RDX’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత దర్శకుడు నహాస్ హిదాయత్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని దుల్కర్ స్వయంగా తన వేఫేరర్ ఫిల్మ్స్ పతాకంపై నిర్మించారు . భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఈ రోజు ( సెప్టెంబర్ 3, 2026 ) థియేటర్లలోకి వచ్చింది. మరి ప్రేక్షకుల అంచనాలను ఏమేరకు అందుకుందో చూద్దాం..

కథేంటి? 

ఈ సినిమా కథ అంతా ‘డాన్ జాన్’ (దుల్కర్ సల్మాన్) అనే ఒక రిస్క్ టేకింగ్, బిందాస్ యంగ్ మెన్ చుట్టూ తిరుగుతుంది. ప్రతి విషయంలోనూ లెక్కలేసుకుని, అదృష్టాన్ని నమ్ముకుని బతికే డాన్.. అనుకోకుండా ఒక భారీ బెట్టింగ్ సామ్రాజ్యంలో చిక్కుకుంటాడు. అక్కడ జరిగిన ఒక ప్రమాదం తర్వాత అతనికి హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరుగుతుంది. అక్కడి నుంచే అసలు కథలోని ఫాంటసీ, ట్విస్ట్ మొదలవుతుంది. ఆ కొత్త చేతికి ఒక ఫ్లాష్‌బ్యాక్, అలాగే ఒక సొంత పగ ఉంటాయి. ఆ చెయ్యి ఇచ్చే సైకలాజికల్, ఫిజికల్ పవర్స్ వల్ల డాన్ ఓ మైటీ విలన్‌తో భారీ రివెంజ్ వార్‌లో దిగాల్సి వస్తుంది. అసలు ఆ చెయ్యి ఎవరిది? డాన్ ఈ చిక్కుల నుంచి ఎలా బయటపడ్డాడు? అనేదే మిగతా కథ.

సినిమాలో ప్లస్ పాయింట్స్..

ఈచిత్రాన్ని తన భుజాలపై మోసింది ఒక్క దుల్కర్ మాత్రమే అని టాక్ వినిపిస్తోంది.. ఒక ‘బ్రాటీ’ (Brat) షేడ్ ఉన్న క్యారెక్టర్‌లో ఆయన స్టైల్, ఎలివేషన్ సీన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. మలయాళ చిత్రసీమకు ఇది పూర్తి కొత్త కాన్సెప్ట్. లార్జర్ దాన్ లైఫ్ స్కేల్, విజువల్ గ్రాండ్‌నెస్, మేకింగ్ స్టైల్ ఫస్టాఫ్‌ను చాలా రిచ్‌గా తీర్చిదిద్దాయి. జేక్స్ బిజోయ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ముఖ్యంగా’రెబుల్’ పాడిన ర్యాప్ ట్రాక్, స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్‌లకు నెవర్ బిఫోర్ ఎనర్జీని ఇచ్చాయంటున్నా రు సినీ ప్రియులు. ఫస్టాఫ్ చాలా ఆసక్తికరంగా, ఫాంటసీ ఎలిమెంట్స్‌తో నడిచిందంటూఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు

మైనస్ ఏంటి? 

అయితే సెకండాఫ్ వచ్చేసరికి సినిమా గ్రాఫ్ పడిపోయింది. సుదీర్ఘమైన రన్‌టైమ్, స్లో ఫేసింగ్  నీరసపరస్తుందని ఆడియెన్స్‌ అభిప్రాయపడుతున్నారు . కాన్సెప్ట్ ఎంత కొత్తగా ఉన్నా, సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలు చాలా రూటీన్ రివెంజ్ ప్రాసెస్ లాగా.. ప్రిడిక్టబుల్‌గా మారడంతో సస్పెన్స్ మిస్ అయిందన్న టాక్ వినిపిస్తోంది. 

ఎవరెలా చేశారంటే?

ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ ‘డాన్ జాన్’ అనే గ్యాంబ్లర్ పాత్రలో కనిపించారు. అదృష్టాన్ని నమ్ముకునే ఒక డిఫరెంట్ షేడ్ ఉన్న క్యారెక్టర్‌లో ఆయన పెర్ఫార్మెన్స్, కరిష్మా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.  కథలోని ఫాంటసీ ఎలిమెంట్ థియేటర్‌లో  మైండ్ బ్లాంక్ అయ్యే ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తోందంటున్నారు ఆడియన్స్‌. దీనికి తోడు కేవలం ఒక నిమిషం పాటు వచ్చే ఒక సర్‌ప్రైజ్ క్యామియో పాత్రపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది.

 

మరోవైపు  మిస్కిన్ వేసిన విలన్ రోల్  పెద్దగా ఆకట్టుకునేలా లేదంటున్నారు. అటు ఆంటోనీ వర్గీస్ పెపే పాత్రకు ఎమోషనల్  స్కోప్ ఉన్నా బలహీనమైన రైటింగ్ వల్ల వేస్ట్ అయింది. నాయిక కయాదు లోహర్‌కు సరైన ప్రాధాన్యం దక్కలేదన్న అభిప్రాయాన్ని ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.

 

తెలుగు ఫ్యాన్స్ కు నిరాశ..

మలయాళంలో ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఏకంగా లక్షా 59 వేల టికెట్లు అమ్ముడైయ్యాయి.  కానీ తెలుగులో రిలీజ్ కాకపోవడంతో అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. సాంకేతిక , డిస్ట్రిబ్యూషన్ కారణాలతో ఈ మూవీని తెలుగు వెర్షన్ విడుదల చివరి నిమిషంలో నిలిచిపోయింది.  త్వరలోనే సమస్యను పరిష్కరించి త్వరలోనే తెలుగు వెర్షన్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ అసౌకర్యానికి చింతిస్తూ ప్రేక్షకులకు క్షమాపణలు తెలిపింది.

దాదాపు మూడేళ్ల తర్వాత మలయాళంలో లీడ్ హీరోగా దుల్కర్ చేసిన ఈ కమ్ బ్యాక్ పై ఫ్యాన్స్ లో ఆసక్తి భారీగానే ఉంది.  ఫస్టాఫ్‌ సాంకేతికంగా, మేకింగ్ పరంగా విజువల్ ట్రీట్‌గా ఉన్నప్పటికీ.. వీక్ ఎమోషన్స్, సెకండాఫ్ స్క్రీన్‌ప్లే వల్ల ఈ ‘ఐ యామ్ గేమ్’ ప్రేక్షకుల్లో మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. తెలుగు వెర్షన్ లో కూడా రిలీజ్ అయితే  ప్రేక్షకుల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో .. మున్ముందు ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి మరి.
 

 

©️ VIL Media Pvt Ltd.