Reading Time: < 1 minute

మెగాస్టార్ ఇంట్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు… క్లిన్ కారా, కవలలతో రామ్‌చరణ్-ఉపాసన సందడి!

Caption of Image.

మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ఈ రోజు ( సెప్టెంబర్ 4, 2026 ) శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో రామ్‌చరణ్, ఉపాసన దంపతుల పాల్గొన్నారు. అయితే ఈ స్టార్ కపుల్ ఎప్పుడూ తమ పిల్లల ప్రైవసీకి ప్రాధాన్యత ఇస్తుంది . కానీ ఈ శుభదినాన తమ ముగ్గురు సంతానంతో కూడిన ఒక క్యూట్ అండ్ ప్రెషియస్ ఫ్యామిలీ మూమెంట్‌ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

పెద్ద కుమార్తె క్లిన్ కారాతో పాటు, కవల పిల్లలు శివ్ రామ్, అన్వీరా దేవిలను లార్డ్ కృష్ణ,  రాధారాణి రూపాల్లో కన్నులపండువగా ముస్తాబు చేశారు. పట్టువస్త్రాలు, పూల అలంకరణల నడుమ పూజా మందిరంలో దైవ భక్తితో సాగిన ఈ వేడుకను చూసి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. “డ్రీమ్ ఫుల్ ఫిల్డ్.. ట్రూలీ బ్లెస్స్డ్’ అంటూ ఉపాసన పెట్టిన డివైన్ క్యాప్షన్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

ఒకవైపు రామ్‌చరణ్ కవలలను, క్లిన్ కారాను ఎత్తుకుని ఎంతో ముచ్చటగా కనిపించడం కొణిదెల ఇంట్లో పండుగ వాతావరణాన్ని మరింత రెట్టింపు చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్ వైరల్ అవుతున్నాయి. అటు అభిమానులు కూడా మెగా పవర్ స్టార్ కుటుంబానికి  శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ తో ముంచెత్తుతున్నారు.

►ALSO READ | సీఎం విజయ్ విజన్ పై అజిత్ ప్రశంసలు.. ‘మోటార్ స్పోర్ట్స్ సిటీ’ ఏర్పాటుపై కీలక ప్రకటన!

 రామ్‌చరణ్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవల విడుదలైన ‘పెద్ది’ చిత్రం తర్వాత.. స్టార్ డైరెక్టర్ సుకుమార్‌తో రాబోతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ యాక్షన్ అడ్వెంచర్ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు. గ్లోబల్ రేంజ్‌లో సినిమాలతో బిజీగా ఉంటూనే, ఇంట్లో ఇలా సంప్రదాయాలకు, కుటుంబ విలువలకు ప్రాధాన్యమిచ్చే రామ్‌చరణ్ రియల్ లైఫ్ యాటిట్యూడ్‌కి మెగా అభిమానులు ప్రశంసిస్తున్నారు.

 

©️ VIL Media Pvt Ltd.