Reading Time: 4 minutes

గార్గోయెల్ స్టోరీ: ఆ నగరంలో జనాలు నిద్రపోతారు..దెయ్యాలు కాపలా కాస్తాయి..ఎక్కడుందో తెలుసా..!

Caption of Image.

దెయ్యాలు ఉన్నాయా? ఉంటే అవి ఎలా ఉంటాయి? ఏంచేస్తాయి? ఒకప్పుడు కథలు కథలుగా చెప్పుకునేవాళ్లు. అలా అప్పటి దెయ్యాల కథలే ఇప్పటికీ ప్రచారంలో ఉంటున్నాయి. అలాంటి కేటగిరీలోదే గార్గోయెల్’ కథ… ఇది భయంకరంగా ఉండే గార్గోయెల్ రూపం.. గాల్లోకి ఎగిరే దెయ్యాలుగా జానపదకథలతో ఫేమస్ అయ్యాయి.  ఆ తర్వాత కాలంలో వీటి ఉనికి గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంతేకాదు వాటి బొమ్మల్ని పెద్ద పెద్ద బిల్డింగులపై ఏర్పాటు చేశారు కూడా.అది ఎందుకో తెలియాలంటే ఈ ‘హ్యూమన్ ఫ్రెండ్లీ ఘోస్ట్’ గురించి తెలుసుకోవాల్సిందే.

గార్గోయెల్- శరీరం భారీగా ఉండి రెక్కల సాయంతో గా ఎగిరే దెయ్యాలు. ఇవి మనుషులకు ఎలాంటి హాని చెయ్యవు.. పైగా చెడుపై పోరాటంలో ఇవి మంచి తరపున నిలబడుతాయనే కథలు ప్రచారంలో ఉన్నాయి. అందుకే ఇవి కి మంచి దెయ్యాలనే పేరు పొందాయి. పూర్వకాలంలో వీటి విగ్రహాల్ని ఎత్తైన బిల్లింగులపై పెట్టేవారు.  అలా ఉంచడానికి కూడా కారణం ఉందని చెప్తుంటారు.

 అవి ఉంటే ఆ దరిదాపుల్లోకి దుష్ట శక్తులు రావని, ఆ బిల్డింగుల్లో ఉండేవాళ్లకి చెడు జరగదనే ఒక నమ్ముతుంటారు. అంటే.. మనదగ్గర దిష్టి బొమ్మలు ఏర్పాటు చేసినట్లన్నమాట. పగలంతా రాతి బొమ్మలుగా ఉండి.. రాత్రిళ్లు ఇవి ప్రాణం పోసుకుని ఆ ప్రాంతాలను రక్షిస్తాయనే కథలు చెప్తుంటారు. 
అయితే ఇవేవీ నమ్మనివాళ్లు గార్గోయెల్ అనేది ఒక ఫాంటసీ క్యారెక్టర్ అని చెప్తుంటారు.

 కానీ, కొన్నేండ్ల క్రితం చిలీ అడవుల్లో వాటిని చూశామని ఒక ఫ్యామిలీ చెప్పడంతో ‘గార్గోయెల్ నిజంగానే ఉన్నాయనే’ ప్రచారం తెరపైకి వచ్చింది. వాటి అన్యేషణలో భాగంగా కొందరు పారానార్మల్ ఇన్వెస్టిగేటర్లు పని చేశారు. ఆ ఫ్యామిలీ ఎక్స్ పీరియెన్స్​ నే  ఇంటర్నేషనల్ పారానార్మల్ సొసైటీ ఒక డాక్యుమెంటరీగా కూడా తీసింది. ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ ఏంటంటే.. ఆ మంచి దెయ్యాల జాడ కోసం ప్రయత్నించిన నలుగురు ఇన్వెస్టిగేటర్లు కనిపించకుండా పోయారు.

కార్మన్ చెప్పిన కథ 

 సౌత్ అమెరికాలోని చిలీ ఉత్తర ప్రాంతంలో 2004, లో తనఫ్యామిలీతో కలిసి కార్మన్ అడెట్జ్ డె లా టోరి అనే అమ్మాయి కారులో ట్రావెల్ చేసింది. ఇంతలో కారు లైట్ల వెలుతురులో దూరంగా ఒక ఆకారం కార్యన్ కి కనిపించింది. ఆ విషయాన్ని ఆమె మిగతా వాళ్లకి చెప్పేటప్పటికే వాళ్లు భయంతో వణికిపోయారు. పక్షుల్లాంటి భారీ రూపం, కంగారుల్లాంటి ఆకారం, భారీ రెక్కలు, కుక్కలాంటి తల.. చూడటానికి విచిత్రంగా.. భయంకరంగా ఉన్నాయి. 

 మొదట అంతా అవి భారీ గబ్బిలాలు అనుకున్నారు. చిలీ అడవుల్లో అలాంటి గబ్బిలాలు ఉండే ఛాన్సే లేదు. పైగా ఆ కుటుంబం పాతికేళ్లుగా ఆ రోడ్డులో చాలాసార్లు ట్రావెల్ చేసింది. కానీ, ఏనాడు అలాంటి ఎక్స్ పీరియెన్స్ ఎదురుకాలేదు. 

సడన్ గా ఒక్కసారిఅవి కారు ఆపోజిట్ డైరెక్షన్లో దూసుకొచ్చాయి. దీంతో అవి ‘గార్గోయెల్స్’ అని కన్ఫర్మ్ చేశాడు కార్యన్ తండ్రి. వెంటనే లోపలి లైట్లను బంద్ చేసి కారును స్పీడ్​గా  పోనిచ్చాడు. అలా నిజమో కాదో తెలియని ‘గార్గోయెల్స్ ఎక్స్ పీరియెన్స్’ ని మీడియాతో పంచుకుంది కార్మన్ ఫ్యామిలీ. దాంతో అవి తిరుగుతున్నాయనే ప్రచారం ఊపందుకుంది. దట్టమైన అమెజాన్ అడవుల్లోనూ ఇప్పటికీ గార్లోయెల్స్ ఉన్నాయని ప్రచారం ఉంది.

 2016లో ఒక రోడ్డు యాక్సిడెంట్ లో కార్బన్ ఫ్యామిలీ మొత్తం చనిపోయింది. ఆ యాక్సిడెంట్ కి గార్గోయెల్స్ కథకి ముడిపెడుతుంటారు. చాలామంది. 2015లో కార్డన్ తన ఫేస్​ బుక్​ లో  ‘కొందరు తమ కుటుంబాన్ని ఫాలో అవుతున్నారని, చంపేస్తామని బెదిరిస్తున్నారని’ ఒక పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ అనుమానాల్ని మరింత బలపరిచింది కూడా. అయితే అది పర్సనల్ రివెంజ్ తో జరిగిన ఎటాక్ అయ్యి ఉంటుందని అనుకుని పోలీసులు కేసు క్లోజ్ చేసేశారు.

కథల్లో గార్గోయెల్స్

క్రీస్తుశకం 600వ సంవత్సరం (రౌన్ ఫ్రాన్స్) ప్రాంతంలోలా గార్గిల్లె అనే భయంకరమైన డ్రాగన్​లాంటి ఒక ప్రాణి ఉండేది. నోటి నుంచి మంట, నీళ్లను చిమ్మే పవర్ దానికి ఉండేది. దీంతో ఊళ్లకు ఊళ్లు తగలబడిపోయేవి.. మునిగిపోయేవి. ఆ టైంలో రోమన్ అనే బిషప్ ఆ ప్రాంతానికి వచ్చాడు. 

తనకు ఒక ఛాన్స్ ఇస్తే ఆ డ్రాగన్ ను అంతం చేస్తానని, అందుకు ప్రతిఫలంగా ఆ ఊరి వాళ్లు క్రిస్టియానిటీకి కన్వర్ట్ కావాలని అతను కోరాడు. అందుకు జనాలు ఒప్పుకున్నారు. క్రాస్(శిలువ)తో ఏవో మంత్రాలు చదివి ఆ డ్రాగన్ ను మాడిమసైపోయేలా చేశాడతను. అయితే లా గార్గిల్లె సాధు జీవి. అది కావాలని ఏనాడూ ఎవరికీ హాని చేయలేదు. పొరపాటున ఊళ్లను డ్యామేజ్ చేసేది. అందుకే అది చనిపోయాక జనాలంతా పాపం అనుకున్నారు. 

టౌన్​ హాల్​ దగ్గర ఆ డ్రాగన్ గార్గోయెల్ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అలా డౌన్ నుంచి యూరప్​ కి.. . అక్కడి నుంచి ప్రపంచం మొత్తం గార్గోయిల్స్ విగ్రహాలు విస్తరించాయని చెప్తుంటారు. కొందరైతే వీటిని దైవదూతలుగా భావిస్తుంటారు.అయితే, దీనికంటే పాత కథ ఇంకొకటి ప్రచారంలో ఉంది. కొన్నివేల సంవత్సరాల కిందట గార్గోయిల్స్ అనేవి. ఒక కమ్యూనిటీగా ఉండేవట. ఒక మాంత్రికుడు వాటిని వశపర్చుకుని.. మనుషులపై దాడులు చేయించేవాడు. 

కింబోర్గిని అనే గార్గోయిల్ ఆ మాయ నుంచి బయటపడి మనుషుల్ని కాపాడేందుకు ప్రయత్నించింది. ఆ తర్వాత అది మిగతా గార్గోయెల్స్ మాంత్రికుడి మాయ నుంచి బయటపడేసింది. ఆ తర్వాత గ్రూప్ లీడర్ గా మారి… ఆ మాంత్రికుడిని ఓడించింది. అఓటమి తట్టుకోలేక… గార్గోయెల్స్ ను రాళ్లుగా మారిపోవాలని, వందేళ్లకొకసారి రాత్రిళ్లు మాత్రమే ప్రాణం తిరిగి వచ్చేలా శాపం ఇచ్చాడు. సినిమాటిక్ గా ఉండే ఈ కథ ఆ తర్వాతి రోజుల్లో బాగా ప్రచారం జరిగింది. అంతేకాదు ఈ స్టోరీ లైన్ తో కొన్ని వందల  నవలలు కూడా వచ్చాయి . 

పాపులర్ కల్చర్

గార్లోయెల్స్ సినిమాల్లో, టీవీ సిరీస్​ లో , నవలల్లో, కథల్లో, ఆఖరికి గేమింగ్ కూడా స్థానం కల్పించారు.
 వాల్ట్ డిస్నీ కంపెనీ 1994 నుంచి మూడేళ్ల పాటు గార్గోయెల్స్ కథతో ఓ టీవీ సిరీస్ ను టెలికాస్ట్ చేసింది. ఒక మాంత్రికుడి శాపంతో రాళ్లుగా మారిపోయిన గార్గోయెల్స్ కొన్ని వేల సంవత్సరాలు పగలంతా బొమ్మలుగా ఉంటాయి. రాత్రి కాగానే నగరంలో తిరుగుతూ కాపలా కాస్తుంటాయి. అలా ఆధునిక కాలంలో న్యూయార్క్ సిటీకి వచ్చేసరికి విలన్స్ బారినుంచి నగరానికి ప్రొటక్షన్ కల్పిస్తుంటాయవి. ఇది గార్గోయెల్స్ టీవీ సిరీస్ కథ. 

ఆ టైంలో గార్గోయెల్స్ సిరీస్ కి బ్యాట్ మాన్ సిరీస్ తో సమానంగా క్రేజ్ దక్కింది. 2006 నుంచి కామిక్ బుక్స్ పబ్లిష్ కావడం స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత మార్కెట్ కామిక్స్ గార్గోయెల్స్  క్యారెక్టర్ ని సూపర్ హీరో సిరీస్ లలో ఒక నెగిటివ్ క్యారెక్టర్గా చూపించింది. తర్వాత మళ్లీ పాజిటివ్ క్యారెక్టర్​ గా  మార్చేసి.. ఒక సాధారణ మనిషితో అది రొమాన్స్ చేసినట్లు యానిమేటెడ్ సిరీస్ ను తీసింది. కానీ, ఆ రొమాన్స్ కి క్రిటిక్స్ మైసన్ రేటింగ్ ఇచ్చారు. 2009లో టాప్ 100 యానిమేటెడ్ సిరీస్ లిస్ట్​ లో  గార్గోయెల్స్ 45వ ప్లేస్ దక్కించుకుంది. ఆ తర్వాత రోజుల్లో వీడియో గేమ్స్ గానే కాకుండా హలోవీన్ ఫెస్ట్ నూ గార్గోయెల్స్ సందడి చేస్తున్నాయి.

వాటర్ పోయేలా..

ఆర్కిటెక్ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే.. గార్గోయెల్స్ అనేవి కేవలం సూపర్ నేచురల్ స్టక్చర్స్ అని. అంతేకాదు అవి మధ్యయుగానికి చెందిన రాతికట్టడాలని చెప్తున్నారు. యూరప్, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో గార్డియెల్స్ బొమ్మలు రకరకాల ఆకారాల్లో ఉన్నాయి. కాబట్టి గార్గోయెల్స్ స్పెషల్ బొమ్మలని అంటున్నారు. అంతేకాదు వాటిని ఏ స్టయిల్లో (గ్రీకు, ఇటాలియన్ ఆర్కిటెక్ స్టయిల్ కావొచ్చనే అనుమానాలు) కట్టించారనేది ఒక క్లారిటీ లేదు.

 గార్గోయెల్ గురించి ఇంజినీర్లు మాత్రం విచిత్రమైన రిపోర్టులు ఇచ్చారు. బిల్డింగ్​ ల  పైకప్పు మీద పడే నీళ్లు గోడల నుంచి కారకుండా.. ఆ బొమ్మ(గార్గోయెల్) ద్వారా నేరుగా కింద పడేలా ఏర్పాట్లను గమనించారు ఇంజినీర్లు. బహుశా ఆ కాలంలో వర్షపు నీరు పోయేందుకే వీటిని కట్టి ఉంటారని ఇంజినీర్లు అంటున్నారు. ఆ లెక్క ప్రకారం గార్గోయెల్ వెనుక ఉన్న కథలను నమ్మాల్సిన అవసరం లేదన్నది వాళ్లు చెప్తున్నమాట.

ఎక్కడెక్కడంటే..

గార్గెల్ అనేది ఒక ఫ్రెంచ్ పదం. దానర్థం ‘గొంతు’ అని… ఇటలీ, జర్మన్, డచ్ భాషల్లో కూడా ఆ పదానికి ఇదే అర్థం వస్తుంది. ఫ్రాన్స్​ లో  వాటర్ ఫౌంటైన్లలో గార్గోయెల్ బొమ్మలు కనిపిస్తుంటాయి. వాటి నోటి నుంచి నీరు పడేలా సెటప్ చేస్తుంటారు. బహుశా గార్గెల్ అనే అర్ధం వల్లే వాటిని ఏర్పాటు చేసి ఉంటారని హిస్టారియన్స్ చెప్తుంటారు. 

గార్గోయెల్స్​ లో  మోస్ట్ ఫేమస్ అయిన విగ్రహం స్ట్రైక్స్’ చేతుల్లో తల పట్టుకున్నట్లు ఉంటుంది ఈ బొమ్మ. డాగ్, సింహపు, గద్ద తలతో ఉండే గార్గోయెల్స్ మాత్రం గ్రీకు ఆర్కిటెక్ స్టయిల్​ తో  ఫ్రాన్స్​ లో అక్కడక్కడ ఏర్పాటు చేశారు. ఇటలీ, పోర్చుగ్రీస్, మిలాన్, న్యూయార్క్, ఇలా.. దాదాపు వెస్ట్​ లో  ఉండే ప్రతీ దేశం, ప్రతీ ప్రధాన నగరాల్లోనూ గార్గోయెల్స్ విగ్రహాలు రకరకాల ఆకారాలతో కనిపిస్తుంటాయి. 

పాతరోజుల్లో ఇవి ఎందుకు ఉన్నాయి? వీటి కథ ఏంటన్న దానిపై ఒక క్లారిటీ అంటూలేదు. కానీ, మోడరన్ కాలంలో ఇవి బిల్డింగులపై షో కోసం, దిష్టి బొమ్మలుగా ఏర్పాటు చేస్తున్నారు. అలా గార్గోయెల్స్ ఒక ఐడెంటిటీ దక్కించుకున్నాయి. అయితే అసలు మిస్టరీ ఏంటంటే.. ‘పాతరోజుల్లో గార్గోయెల్స్ విగ్రహాల్ని ఎవరు పెట్టారు? అసలు వాటిని ఎందుకు పెట్టారు?” అనేవాటికి ఎక్కడా సమాధానం దొరక్కకలేదని చరిత్రకారుల ద్వారా తెలుస్తుంది. 

©️ VIL Media Pvt Ltd.