Reading Time: < 1 minute

Vastu tips: బెడ్రూంకు రెండు డోర్లు ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. తలుపులకు దేవుడి పటాలుంటే పూజ చేయాలా..!

Caption of Image.

ఇంట్లో ప్రతిది వాస్తు ప్రకారమే ఉండాలి.. అంతేకాదు ఇంటి తలుపుల  విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.  బెడ్​ రూంకు రెండు డోర్లు ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఇంటి తలుపులకు  ఉండే దేవుడి పటాలు.. చిత్రాలకు పూజలు చేయాలా.. …మొదలగు విషయాల గురించి వాస్తు కన్సల్టెంట్​  కాశీనాథుని శ్రీనివాస్​ గారు ఏమంటున్నారో చూద్దాం…

ప్రశ్న: బెడ్ రూమ్ కు రెండు డోర్స్ ఉంటే మంచిదేనా?

జవాబు: బెడ్​రూమ్ కు రెండు డోర్స్ ఏర్పాటు చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నైరుతి వైపు డోర్ ఉండకూడదు. ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్య దిక్కులలో ఏవైనా రెండు దిక్కులు డోర్స్ పెట్టుకోవాలి.

ప్రశ్న : తలుపులకు ఉండే దేవుడి ప్రతిమలకు కూడా పూజలు చేయాలా? వాటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

జవాబు : వాటికి ప్రత్యేకంగా పూజలు చేయకపోయినా పర్లేదు. పూజ గదిలో ఉండే ఇష్ట దైవానికి భక్తితో పూజలు చేస్తే సరిపోతుంది.

©️ VIL Media Pvt Ltd.