Reading Time: < 1 minute

పౌల్ట్రీ, డెయిరీలకు ఇంటి పన్ను మినహాయింపు..పంచాయతీల్లో సాధారణ పన్ను రద్దు చేస్తూ ఉత్తర్వులు

Caption of Image.
  • జీవో జారీ చేసిన పంచాయతీరాజ్ శాఖ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల పరిధిలోని పౌల్ట్రీ ఫారాలు, డెయిరీ యూనిట్లకు సాధారణ ఆస్తి పన్ను (ఇంటి పన్ను) నుంచి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేస్తూ.. ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జీవో ఎంఎస్ నం.22ను విడుదల చేశారు.

గ్రామ పంచాయతీలు ఇకపై పౌల్ట్రీ, డెయిరీ యూనిట్లపై సాధారణ ఇంటి పన్ను విధించకూడదు. అయితే, ఆయా యూనిట్లకు సంబంధించిన ఆస్తి వివరాలు, గ్రామ పంచాయతీ రికార్డులు పక్కాగా ఉండడం కోసం మాత్రమే నామమాత్రపు రుసుముగా ఏడాదికి రూ.100 వసూలు చేయాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో పౌల్ట్రీ, పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు, రైతులపై పన్నుల భారం తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిబంధనలను వెంటనే అమలు చేయాలని పంచాయతీ రాజ్ కమిషనర్‌‌‌‌ను ప్రభుత్వం ఆదేశించింది.

©️ VIL Media Pvt Ltd.