
చెన్నై: తమిళనాడులో ఒక నర్సు హత్య దర్యాప్తు కేసులో పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. హద్దులు దాటిన వివాహేతర సంబంధాల కారణంగా ఇద్దరు పిల్లల తల్లి అయిన సదరు నర్సు హత్యకు గురైంది. ఈ ఘటన తేని జిల్లాతో పాటు తమిళనాడు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
తేని జిల్లాలోని ఆండిపట్టి పాపమ్మల్‌పురానికి చెందిన మహిళ సెల్వి (48). ఆమె ఆండిపట్టి ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుండేది. 2021, నవంబర్ 24న ఆమె తన ఇంట్లోనే దారుణ హత్యకు గురైంది. ఈ కేసు దర్యాప్తు దాదాపు ఐదేళ్ల తర్వాత మొత్తానికి ఓ కొలిక్కి వచ్చింది.
నర్సు పరిచయాలు, వివాహేతర సంబంధాలు తెలిసి ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు విస్తుపోయారు. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న సెల్వి భర్తతో విభేదాల కారణంగా ఒంటరిగా ఉండేది. ఆమె పిల్లలు కూడా భర్త దగ్గరే పెరిగారు. సెల్వి అండిపట్టిలో ఓ ఇల్లును అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉండేది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా.. పోలీసులు ఆమె అద్దెకు ఉన్న ఇంటిని సోదా చేశారు. ఇంట్లో దాదాపు 500 హై క్వాలిటీ కండోమ్స్ పోలీసులకు దొరికాయి.
ఒక మహిళ ఇంట్లో ఇన్ని కండోమ్స్ ఎందుకు ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిశాయి. ఆమె ఫోన్ కాంటాక్ట్స్ను, కాల్ డేటాను పోలీసులు పరిశీలించారు. 300 మంది మగాళ్ల ఫోన్ నంబర్లను కాంటాక్ట్ లిస్ట్లో పోలీసులు గుర్తించారు. వాళ్లలో ఒకరితో ఒకరికి ఏమాత్రం సంబంధం లేదు.
వీళ్లలో.. 150 మందితో ఆమె వివాహేతర సంబంధం కొనసాగించిందని.. వాళ్లతో కాల్స్లో ఆమె టచ్ లో ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగించిన వారిలో పోలీసులు, డాక్టర్లు, ఆటో డ్రైవర్లు.. ఇలా కొందరు ప్రముఖులు కూడా ఉన్నట్లు కాల్ లిస్ట్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. వాళ్లతో వివాహేతర సంబంధాలను కొనసాగించేందుకు ఆమె అన్ని కండోమ్స్ను ఇంట్లో ఉంచినట్లు పోలీసులు తేల్చారు.
కేసు దర్యాప్తులో కంబం ప్రభుత్వాస్పత్రి పనిచేసే రామచంద్రప్రభు అనే వ్యక్తిపై పోలీసులకు అనుమానం వచ్చింది. విచారణకు హాజరుకావాలని పోలీసులు అతనికి సమన్లు పంపారు. అయితే.. ఈ నోటీసులు అందుకున్న తర్వాత రోజే విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో.. పోలీసుల దృష్టి అతనిపై పడింది. గతంలో వీరిద్దరూ ఒకే ఆస్పత్రిలో పనిచేసిన సమయంలో ఇద్దరికీ పరిచయం అయింది. ఈ పరిచయం కొన్నాళ్లకు వివాహేతర సంబంధానికి దారితీసింది.
సెల్వి హత్య జరిగిన రోజు సీసీటీవీ ఫుటేజీలో రామచంద్ర ప్రభు సెల్వి ఇంటికి వచ్చి వెళ్లినట్లు స్పష్టమైంది. అదే రోజు సాయంత్రం సెల్వి బంగారు గొలుసును అతను ఓ తాకట్టు దుకాణంలో కుదవపెట్టినట్లు పోలీసులకు ఆధారాలు దొరికాయి. ఘటనా స్థలంలో దొరికిన ఫుట్ ప్రింట్స్ రామచంద్ర ప్రభువేనని ఫోరెన్సిక్ అధికారులు కూడా తేల్చారు.
ఈ క్రమంలో.. సెల్విని రామచంద్ర ప్రభు హత్య చేసినట్లు పోలీసులకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఎందుకు హత్య చేశాడనే కారణాలపై రామచంద్ర ప్రభుతో పాటు అతని భార్యను కూడా పోలీసులు విచారించారు. రామచంద్రప్రభు భార్యను విచారించగా.. తన భర్త సెల్వికి లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడని తెలిసింది. ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని సెల్విని తన భర్త ఒత్తిడి చేయడంతో ఇద్దరి మధ్య లొల్లైంది. ఈ క్రమంలోనే రామచంద్ర ప్రభు హత్య చేశాడు. అరెస్ట్ భయంతోనే అతను ఆత్మహత్య చేసుకున్నాడని స్పష్టమైంది.