Reading Time: < 1 minute
ఈ మొక్క ఎముకల బలానికి సంజీవని.. కీళ్ల నొప్పుల నుంచి జీర్ణ సమస్యల వరకు అద్భుత ఔషధం!

మన గ్రామీణ ప్రాంతాల్లో పొలాలు, ప్రహరీ గోడలపై తీగలా అల్లుకునే నల్లేరు కేవలం ఒక పిచ్చి మొక్క కాదు. ప్రాచీన ఆయుర్వేద వైద్యంలో దీనిని అస్థి సంహారక అని పిలుస్తారు. నల్లేరు కాండంలో ఉండే అద్భుతమైన పోషకాలు, ఖనిజాలు అనేక ఆరోగ్య సమస్యలను నయం చేయడంలో సంజీవనిలా పనిచేస్తాయి.

ఎముకల ఆరోగ్యం, విరిగిన ఎముకల నివారణ:

నల్లేరుకు ఉన్న అతిపెద్ద ప్రత్యేకత ఎముకల ఆరోగ్యానికి తోడ్పడటం. ప్రమాదవశాత్తు ఎముకలు విరిగినప్పుడు, నల్లేరు కషాయం లేదా పొడిని తీసుకోవడం వల్ల ఎముకలు వేగంగా నివారణ పొందుతాయి. ఇది ఎముకల్లో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. వయస్సు పైబడటం వల్ల వచ్చే ఆస్టియోపోరోసిస్, కీళ్ల నొప్పులు, మోకాళ్ల అరుగుదల తగ్గించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

జీర్ణవ్యవస్థ శోధన, పైల్స్ ఉపశమనం:

జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి నల్లేరు గొప్ప ఔషధం. ఆకలి మందగించడం, జీర్ణక్రియ లోపించడం, కడుపులో గ్యాస్, ఉబ్బరం ఉన్నప్పుడు నల్లేరుతో చేసిన చట్నీ లేదా తొక్కు తీసుకోవడం వల్ల జీర్ణరసాలు ఊరి ఆకలి పెరుగుతుంది.

అర్శమొలలు:

నల్లేరులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, వాపు నిరోధక గుణాలు పైల్స్ వల్ల కలిగే మంట, నొప్పి, రక్తం పడటాన్ని తగ్గిస్తాయి.

బరువు తగ్గేందుకు, గుండె ఆరోగ్యానికి:

నల్లేరు శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గించి, మెటబాలిజంను వేగవంతం చేస్తుంది. దీనివల్ల అధిక బరువు సమస్యతో బాధపడేవారు త్వరగా బరువు తగ్గవచ్చు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేసి డయాబెటిస్‌ను నియంత్నించడంలో తోడ్పడుతుంది.

ఎలా ఉపయోగించాలి?:

నల్లేరును వంటల్లో వాడేటప్పుడు కొద్దిగా చింతపండు, నూనె ఉపయోగించి కాండం పైన ఉండే పీచును తొలగించాలి. లేకపోతే ఇది గొంతులో దురద పుట్టించే అవకాశం ఉంది. నల్లేరు తొక్కు, పచ్చడి లేదా కషాయం రూపంలో దీనిని తీసుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..