Reading Time: < 1 minute

అసెంబ్లీకి రాని కేసీఆర్ రాజీనామా చేయాలి

Caption of Image.

బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: అసెంబ్లీకి రాని మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయకుడు, ఎమ్మార్పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి దేవని సతీశ్​ మాదిగ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఎస్సీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చౌరస్తాలోని బాబు జగ్జీవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విగ్రహం వద్ద గురువారం నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆయన మాట్లాడారు. కేసీఆర్​కు సంబంధించిన ప్రభుత్వ ఖర్చు రూ.22.24 కోట్లకు చేరిందని, ప్రతిపక్ష నేత బాధ్యతలు నిర్వహించని ఆయనకు ఎమ్మెల్యే పదవి ఎందుకని ప్రశ్నించారు.  

సైనిక్‌‌‌‌పురి నుంచి బైక్‌‌‌‌ ర్యాలీ

మల్కాజిగిరి: అసెంబ్లీకి దూరంగా ఉంటున్న కేసీఆర్‌‌‌‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ మేడ్చల్‌‌‌‌ జిల్లా వ్యవసాయ మార్కెట్‌‌‌‌ కమిటీ వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ విఠల్‌‌‌‌నాయక్‌‌‌‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌‌‌‌ నాయకులు గురువారం బైక్‌‌‌‌ ర్యాలీ నిర్వహించారు. సైనిక్​పురి నుంచి ఈసీఐఎల్‌‌‌‌ వరకు ర్యాలీ కొనసాగింది. కాంగ్రెస్‌‌‌‌ కాప్రా డివిజన్‌‌‌‌ అధ్యక్షుడు తన్నీరు శ్రీహరి, ఏఎస్‌‌‌‌రావునగర్‌‌‌‌డివిజన్‌‌‌‌ అధ్యక్షుడు కేశెట్టి ప్రసాద్‌‌‌‌, మేడ్చల్‌‌‌‌ జిల్లా కాంగ్రెస్‌‌‌‌ కార్యదర్శులు దండ్ల మురళి, పాకాల రాజు  తదితరులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.