Reading Time: < 1 minute

చెన్నూరులో కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు.. మంత్రి వివేక్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన గులాబీ శ్రేణులు..

Caption of Image.

చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు నమోదయ్యాయి. శుక్రవారం ( సెప్టెంబర్ 4 ) మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు గులాబీ శ్రేణులు. చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలం రాంపూర్ గ్రామంలో పర్యటించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా మంత్రి వివేక్ సమక్షంలో పెద్దఎత్తున కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు గులాబీ శ్రేణులు.

రాంపూర్ గ్రామ సర్పంచ్ మనమంద రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు పలువురు వార్డు సభ్యులు, స్థానిక నాయకులు, యువకులు, మహిళలు. నూతనంగా పార్టీలో చేరిన సర్పంచ్ మనమంద రమేష్‌తో పాటు గ్రామస్తులకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సీఎం రేవంత్ నేతృత్వంలోని ‘ప్రజా పాలన’ సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో సాగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు నేతలు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. రాంపూర్ గ్రామ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి వివేక్. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఎన్నికల సమయంలో రాంపూర్ గ్రామానికి వచినప్పుడు సీసీ రోడ్లు కావాలని అడిగారని.. ఇప్పటికే రూ.26 లక్షల నిధులు ఇచ్చామని అన్నారు.రాంపూర్ గ్రామానికి అదనంగా మరో రూ.10 లక్షల నిధులు మంజూరు చేస్తున్నానని అన్నారు మంత్రి వివేక్.

తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ లు అమలు చేస్తున్నామని.. ప్రతీ ఇంటికి 200 వందల యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తున్నామని.. మహిళలకు ఉచిత బస్సు, రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం ఇస్తున్నామని అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇస్తున్నామని.. గతంలో డబుల్ బెడ్ రూం ఇస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు.

ఇప్పటికే గ్రామానికి 20 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని… ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎవరికీ కూడా డబ్బులు ఇవ్వాల్సిన పని లేదని స్పష్టం చేశారు మంత్రి వివేక్.

©️ VIL Media Pvt Ltd.