
- మూడు రోజుల్లో పని కంప్లీట్ కావాలి
- ఇంజనీర్లకు సదరన్ డిస్కమ్ సీఎండీ జితేశ్ వి. పాటిల్ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన రైతు డిస్కమ్‌కు బదిలీ చేయాల్సిన నెట్‌వర్క్ అసెట్ డేటాను మూడు రోజుల్లో సిద్ధం చేయాలని ఇంజనీర్లను సదరన్ డిస్కమ్ సీఎండీ జితేశ్ వి.పాటిల్ ఆదేశించారు. ఈ ప్రక్రియపై సూపరింటెండింగ్ ఇంజినీర్లు, సీనియర్ అకౌంట్స్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. బుధవారం హైదరాబాద్ మింట్ కాంపౌండ్ నుంచి సీఈలు, ఎస్‌ఈలు, డీఈలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
శ్రీకృష్ణాష్టమి, వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో విద్యుత్ భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎండీ ఆదేశించారు. వేలాడుతున్న కరెంట్ తీగల తొలగింపు, వంగిపోయిన, తుప్పుపట్టిన స్తంభాల మార్పు, అవసరమైన ప్రాంతాల్లో ఏబీ కేబుళ్ల ఏర్పాటు పనులను స్పీడప్ చేయాలన్నారు. హైదరాబాద్ సౌత్ సర్కిల్ పరిధిలోని సిటీ-9 బేగంబజార్ డివిజన్‌ను సీఎండీ జితేష్ వి.పాటిల్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.