
ఉక్రెయిన్‌కు మద్దతుగా 70 మిలియన్ యూరోల ఆయుధ సామగ్రి ఒప్పందానికి సంబంధించిన కుంభకోణం బయటపడటంతో.. యూరప్లోని ఎస్టోనియా దేశ రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్ రాజీనామా చేశారు. ఎస్టోనియా జాతీయ ఆడిట్ కార్యాలయం రిపోర్ట్ బయటపెట్టడంతో.. ఆ డీల్కు తాను బాధ్యత వహిస్తున్నానని చెబుతూ పెవ్‌కుర్ రాజీనామా చేశారు.
Defence Minister Hanno Pevkur has resigned.
Thank you for leading Estonia’s national defence and for your steadfast support for Ukraine.
Hanno Pevkur served as Minister of Defence from 18 July 2022.
During this time, Europe’s security environment has changed significantly, and… pic.twitter.com/3SbelE64Yk
— MoD Estonia (@MoD_Estonia) September 2, 2026
హన్నో పెవ్కుర్ 18 జూలై 2022 నుంచి ఎస్టోనియా రక్షణ మంత్రిగా పనిచేశారు. ఈ కుంభకోణం 2024లో ఎస్టోనియన్ సెంటర్ ఫర్ డిఫెన్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ సంతకం చేసిన ఒప్పందాల దగ్గర మొదలైంది. ఈ ఒప్పందాలను డేటాసెల్ ఎస్ఆర్ఎల్ అనే ఇటాలియన్ సంస్థకు అప్పగించారు. దీనిని 2024లో మన దేశానికి చెందిన నెకో డిఫెన్స్ మునిషన్స్ కొనుగోలు చేసింది.
రష్యాతో యుద్ధ సమయంలో ఉక్రెయిన్ తీవ్రమైన మందుగుండు సామగ్రి కొరతను ఎదుర్కొంది. దీంతో.. ఆ దేశానికి ఫిరంగి గుళ్లను సమకూర్చడానికి ఎస్టోనియా యూరోపియన్ యూనియన్ (EU) నిధుల నుంచి సుమారు 70 మిలియన్ యూరోలు చెల్లించింది. మన కరెన్సీలో రూ.769 కోట్లు. అయితే, ఈ కొనుగోలుపై ఎస్టోనియా అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
►ALSO READ | మిరాకిల్..తొమ్మిది రోజుల తర్వాత.. నేపాల్ టన్నెల్ నుంచి ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు
డేటాసెల్ లేదా నెకో సంస్థలకు గతంలో ఫిరంగి గుళ్లను తయారు చేసిన లేదా సరఫరా చేసిన రికార్డులు లేకపోవడంతో ఎస్టోనియా అధికారులు ఈ ఒప్పందాన్ని రద్దు చేశారు. ఎస్టోనియా ఆ డబ్బును తిరిగి రాబట్టుకోవడానికి చట్టపరమైన చర్యలు ప్రారంభించడంతో పాటు, ఈ ప్రక్రియపై నేర విచారణ కూడా మొదలైంది.
మందు గుండు సామగ్రి నాణ్యతలో లోపం ఉందన్న ఆరోపణలను నెకో, డేటాసెల్ తిరస్కరించాయి. ఈ సమస్య యూరోపియన్ నిబంధనలు, నిధుల కేటాయింపులలోని మార్పులతో ముడిపడి ఉందని వారు వాదించారు. ముందస్తు చెల్లింపుల ద్వారా 59 మిలియన్ యూరోలు అందుకున్న తర్వాత, 58 మిలియన్ యూరోల విలువైన వస్తువులను పంపిణీ చేసినట్లు ఆ కంపెనీ పేర్కొంది. ఈ మొత్తం కుంభకోణంలో మన దేశానికి చెందిన సంస్థ ప్రమేయం కూడా ఉండటంతో మన దేశ రక్షణ శాఖ కూడా ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది.