
చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘కాకా’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబర్ 7 నుంచి హైదరాబాద్‌లో భారీ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ లెంగ్తీ షెడ్యూల్‌లో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈ సందర్భంగా విడుదల చేసిన వర్కింగ్ స్టిల్‌లో చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి షూటింగ్ లొకేషన్ లో డిస్కస్ చేస్తూ కనిపించారు. ఈ బిహైండ్ ద సీన్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రీసెంట్‌గా చిరంజీవి బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్‌తో సినిమాపై అంచనాలు పెంచింది.
అనస్వర రాజన్, నివేదా పేతురాజ్, సునీల్, గెటప్ శ్రీను కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న సినిమా విడుదల కానుంది.