Reading Time: < 1 minute

హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో అరుదైన చికిత్స… కడుపులో బ్లేడ్ ముక్కలు తొలగించారు..

Caption of Image.

వైద్యో నారాయణో హరి అంటారు… డాక్టర్లు దేవుడితో సమానమని చెప్పడానికి చాలా సంఘటనలు నిదర్శనంగా నిలిచాయి. ఇక  బతకరు అనుకున్నవారిని సైతం డాక్టర్లు బతికించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి మరో ఘటన హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. కడుపులో బ్లేడ్ ముక్కలు తొలగించి అరుదైన చికిత్స చేసిన ఘనత సాధించారు ఉస్మానియా డాక్టర్లు. గురువారం ( సెప్టెంబర్ 3 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి…

రేజర్ బ్లేడ్ ముక్కలు ముక్కలు మింగిన 16 ఏళ్ళ బాలుడు హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో చేరాడు. ఈ క్రమంలో ఎక్స్ రేలో కడుపులో బ్లేడ్ ముక్కలు ఉన్నట్లు గుర్తించిన డాక్టర్లు బాలుడిని జనరల్ వార్డ్ నుంచి గ్యాస్ట్రో ఎంటరాలజి విభాగానికి షిఫ్ట్ చేశారు. ఈ క్రమంలో ఎండోస్కోపీ ద్వారా బ్లేడ్ ముక్కలు తొలగించారు డాక్టర్లు. పదునైన బ్లేడ్ ముక్కలు కావడంతో తీవ్ర సవాళ్లతో కూడిన ఈ చికిత్స అత్యంత జాగ్రత్తగా నిర్వహించారు డాక్టర్లు.

►ALSO READ | హిట్ అండ్ రన్ కేసులో ఆనంద్ సాయి కొడుకు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు !

బ్లేడ్‌ ముక్కలతో కడుపు లోపలి భాగాలకు గాయాలు, పేగులు చిల్లులు పడే ప్రమాదం ఉందని.. అయినా అత్యంత జాగ్రత్తగా మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతిలో విజయవంతంగా తొలగించామని అంటున్నారు డాక్టర్లు. ప్రొఫెసర్, హెచ్‌ఓడీ డాక్టర్ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ  చికిత్స నిర్వహించారు.

ఇతర వైద్యులు, సిబ్బంది సహకారంతో ఆపరేషన్ విజయవంతం అయ్యిందని.. చికిత్స అనంతరం బాలుడి ఆరోగ్యం నిలకడగా.. ప్రస్తుతం బాగానే ఉన్నట్లు వెల్లడించారు డాక్టర్లు. అతికష్టమైన చికిత్సను సమర్థవంతంగా నిర్వహించి తమ బిడ్డ ప్రాణాలు రక్షించిన డాక్టర్లకు కృతఙ్ఞతలు తెలిపారు బాలుడి తల్లిదండ్రులు.

©️ VIL Media Pvt Ltd.