Reading Time: < 1 minute
Konda Surekha To Be Removed As Telangana Minister Key Changes In Top Posts

Konda Surekha: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు గవర్నర్‌కు సిఫార్సు కూడా పంపినట్లు పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్‌గా ఉన్న డాక్టర్ జి. చిన్నారెడ్డి నియామకాన్ని తక్షణమే రద్దు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆయన స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్‌గా నియమించినట్లు వెల్లడించారు.

మరోవైపు హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా నీరెల్లా శారదను నియమించేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపినట్లు సమాచారం. మహిళా కమిషన్‌లో ఈ నియామకం త్వరలోనే అధికారికంగా అమల్లోకి రానుంది. ఇక కాకతీయ పట్టణ అభివృద్ధి ప్రాధికార సంస్థ (కుడా) ఛైర్‌పర్సన్‌గా మాజీ రాజ్యసభ ఎంపీ జి. సుధా రాణిని నియమించేందుకు కూడా ముఖ్యమంత్రి ఆమోదం తెలిపినట్లు సమాచారం. దీంతో తెలంగాణలో మంత్రివర్గంతో పాటు పలు కీలక నామినేటెడ్ పదవుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.

ఈ నిర్ణయాలతో రాష్ట్ర రాజకీయాల్లో మరిన్ని మార్పులు ఉండొచ్చనే చర్చకు తెరలేచింది. అయితే నియామకాలు, తొలగింపులకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడిన తర్వాత పూర్తి వివరాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది.