Reading Time: < 1 minute
INDW vs PAKW: హ్యాట్రిక్ విక్టరీపై కన్నేసిన భారత్.. అందరి ఫోకస్ ఆ విషయంపైనే..?

India Women vs Pakistan Women Head to Head: భారత మహిళల జట్టు 2026 మహిళల ఆసియా కప్ సెమీఫైనల్స్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. అయితే, అంతకుముందు గ్రూప్ దశలో తన చివరి మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌ కోసం ఫ్యాన్స్ ఎంతగనో ఎదురుచూస్తున్నారు. భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌ ఎప్పుడూ ఉత్సాహభరితంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా, ఇటీవలి కాలంలో పాకిస్థాన్ క్రికెట్ స్థాయి గణనీయంగా పడిపోయింది. మరి భారత్‌తో మ్యాచ్‌ను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

ఇరుజట్లలో ఆధిపత్యం ఎవరిదంటే?

మహిళల క్రికెట్‌లో పాకిస్థాన్‌పై భారత జట్టుదే ఆధిపత్యం. ఈ విషయం గణాంకాలలో స్పష్టంగా కనిపిస్తోంది. భారత్ వర్సెస్ పాకిస్థాన్ మహిళల ఆసియా కప్ మ్యాచ్‌కు ముందు, ఇరు జట్ల మధ్య హోరా హోరీ రికార్డులు ఎలా ఉన్నాయో చూద్దాం..

భారత మహిళలు vs పాకిస్తాన్ మహిళల మ్యాచ్ వివరాలు..

భారత్, పాకిస్తాన్‌ల మధ్య మహిళల ఆసియా కప్ మ్యాచ్ సెప్టెంబర్ 5వ తేదీ, శనివారం నాడు జరగనుంది. ఈ మ్యాచ్ దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8:00 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ రాత్రి 7:30 గంటలకు జరుగుతుంది.

భారత vs పాకిస్తాన్ గణాంకాలు..

టీ20లలో భారత మహిళల జట్టు, పాకిస్తాన్ మహిళల జట్టు 17 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత జట్టుదే పైచేయిగా నిలిచింది. భారత్, పాకిస్తాన్‌ను 14 సార్లు ఓడించగా, పాకిస్తాన్ కేవలం 3 సార్లు మాత్రమే భారత్‌ను ఓడించగలిగింది.

మహిళల టీ20 క్రికెట్‌లో పాకిస్థాన్ చివరిసారిగా 2022లో భారత్‌ను ఓడించింది. ఆ తర్వాత ఈ రెండు జట్లు 4 సార్లు తలపడ్డాయి. ఆ 4 సార్లూ టీమ్ ఇండియానే విజయం సాధించింది.

మొత్తం మ్యాచ్‌లు: 17

భారత్ గెలిచింది: 14

పాకిస్థాన్ గెలిచింది: 3

ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలి?

ఆసియా కప్‌లో భారత మహిళల జట్టు, పాకిస్తాన్ మహిళల జట్టు మధ్య జరిగే మ్యాచ్ సెప్టెంబర్ 5వ తేదీన భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. భారతదేశంలో, ఈ మ్యాచ్ సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. సోనీ లివ్ యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..