Reading Time: 2 minutes
Ambani Home: ముఖేష్ అంబానీ ఇల్లు ఇప్పుడు అమ్మితే ఎంత ధర ఉంటుంది? తెలిస్తే షాకవుతారు!

Antilia House Price: ముఖేష్‌ అంబానీ.. ఈ పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. అంబానీ అంటే అందరికి తెలిసిందే. ఆసియాలోని ధనవంతుల్లో ముఖేష్ అంబానీ ఒకరు. అంబానీ ఫ్యామిలీ ఆల్టామౌంట్ రోడ్‌లో ఉన్న యాంటిలియా భవనంలో నివసిస్తోంది. ఈ యాంటిలియా భవనాన్ని 2010లో నిర్మాణం చేపట్టారు. అప్పట్లో దీనిని నిర్మించడానికి అక్షరాల సుమారు రూ.15,000 కోట్లకుపైనే ఖర్చు అయినట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఈ యాంటిలియా భవనం నిర్మించడానికి సుమారు నాలుగు సంవత్సరాలు పట్టింది. ఈ బిల్డింగ్‌ నిర్మాణం 2006లో మొదలు పెట్టగా, 2010లో పూర్తయ్యింది. ఈ భవనంలో అత్యాధునిక హంగులతో నిర్మించారు. భారీ భూకంపం వచ్చినా ఏ మాత్రం కుంగిపోకుండా నిర్మించారు. అయితే బేస్ స్ట్రక్చర్‌కే కేవలం రూ.6,000 కోట్లు అయినట్టు సమాచారం.

ఇది కూడా చదవండి: Today Gold Price: భారీగా పతనమవుతున్న బంగారం ధరలు.. ఒక్క రోజులో ఎంత తగ్గిందంటే..

ఇప్పుడు యాంటిలియా భవనం ఖరీదు ఎంత ఉంటుంది?

అప్పట్లో యాంటిలియా నిర్మాణానికి 15000 కోట్లు ఖర్చుయిందంటే.. ఇప్పుడు దాని ధర ఎంత ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం 2026లో యాంటిలియాను నిర్మించాలంటే రెట్టింపు ఖర్చు అవుతుందట.. అంటే సుమారు రూ.38,000 కోట్లకు పైగా కావాలి. ముంబైలో భూమి ధరలు, సిమెంట్, స్టీల్ వంటి వాటి ధరలు పెరగడమే దీనికి కారణం. అంటే యాంటిలియాను ఇప్పుడు అమ్మితే రూ.38,000 కోట్ల నుంచి రూ.40,000 కోట్లు ధర ఉంటుందని రియల్‌ ఎస్టేట్‌ నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: SBI: ఎస్‌బీఐలో పిల్లల కోసం అద్భుతమైన స్కీమ్‌.. ఐదేళ్లు కడితే చాలు.. చేతికి రూ.45 లక్షలు!

ఇంటీరియర్..

యాంటిలియా భవనం బయటి నుంచే కాదు కాకుండా లోపల ఇంటీరియర్ చూస్తే ఎంతో అందంగా ఉంటుంది. ఈ భవనాన్ని చూస్తుంటే చూపు తిప్పుకోలేనంతగా ఉంటుంది. ముంబై నడిబొడ్డున ఇలాంటి మరో భవంతిని కట్టడం ఎవరికైనా అసాధ్యమే అని చెప్పుకోవాలి.

యాంటిలియా ఇంట్లోలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ ఇంట్లో 4,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇది 8.0 తీవ్రత భూకంపాన్ని తట్టుకుంటుంది. ఈ ఇంట్లో 3 హెలిప్యాడ్‌లు, 168 కార్ల కోసం 6 అంతస్తుల పార్కింగ్, ప్రైవేట్ సినిమా థియేటర్, జిమ్, స్పా, గుడి.. ఇలా ఎన్నో ఏర్పాట్లు ఉన్నాయి. ముంబై వేడిని తట్టుకోవడానికి ప్రత్యేకంగా ‘స్నో రూమ్’ కూడా ఏర్పాటు చేశారు.

ఇది కూడా చదవండి: Personal Loan: మీకు ఎంత జీతం ఉంటే బ్యాంకు పర్సనల్‌ లోన్‌ ఇస్తుంది..? ఎంత ఆదాయం అవసరం..?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి