
Rohit Sharma Retirement: 2027 వన్డే ప్రపంచకప్‌లో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆడతాడా లేదా అనే ఊహాగానాలకు బీసీసీఐ తెరదించింది. ముంబైలోని ప్రధాన కార్యాలయంలో ఈరోజు (సెప్టెంబర్ 3న) జరిగిన సమీక్షా సమావేశం అనంతరం రోహిత్ స్థానానికి ఎలాంటి ముప్పూ లేదని భారత క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. రోహిత్ భవిష్యత్తుపై ప్రస్తుతం యథాతథ స్థితి (Status Quo) కొనసాగుతుందని, అతడు ప్రసుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జీత్ సైకియా స్పష్టం చేశారు.