Reading Time: < 1 minute

జమ్మూ కాశ్మీర్‎లో ఎన్ కౌంటర్.. సైన్యం చేతిలో టెర్రరిస్ట్ హతం

Caption of Image.

శ్రీనగర్: జమ్ము కాశ్మీర్‎లోని బుద్గాం జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాల చేతిలో ఓ టెర్రరిస్ట్ హతమయ్యాడు. అధికారుల వివరాల ప్రకారం.. పుల్వామా జిల్లాలోని పఖేర్‌పోరా నుంచి బుద్గామ్‌లోని యూస్‌మార్గ్ వైపు ఉగ్రవాదుల బృందం ప్రయాణిస్తో్ందన్న ఇంటలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు శుక్రవారం (సెప్టెంబర్ 4) భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి.

 బుద్గాంలోని అష్దర్ గలి అటవీ ప్రాంతంలో భద్రతా దళాలకు ఉగ్రవాదులు తారసపడ్డారు. ఈ క్రమంలో భద్రతా దళాలపై ఉగ్రవాదులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన సైన్యం కౌంటర్ ఫైరింగ్ జరిపింది. ఇరుపక్షాల మధ్య జరిగిన భీకరమైన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడని అధికారులు తెలిపారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి ఒక ఏకే రైఫిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. 

అదే అటవీ ప్రాంతంలో మరో ఉగ్రవాది నక్కి ఉన్నాడని సమాచారంతో భద్రతా దళాలు ఆ ప్రాంతంలో గాలింపు కొనసాగిస్తున్నాయి. దీంతో ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. అనుమానిత ఉగ్రవాదిని గుర్తించేందుకు అదనపు బలగాలు రంగంలోకి దిగాయి. ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదిని ఇంకా గుర్తించలేదు.

►ALSO READ | MP మహువా మొయిత్రాపై నాన్ బెయిలబుల్ కేసు

శ్రీనగర్ కేంద్రంగా పనిచేస్తున్న చినార్ కార్ప్స్ ఈ ఆపరేషన్‌ను ధృవీకరించింది. నిఘా సమాచారం ఆ ధారంగాబుద్గాంలోని అష్దర్ గలిలో భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ  కాల్పుల్లో సైన్యం ఒక ఉగ్రవాదిని హతమార్చగా.. ఘటన స్థంలో ఒక ఏకే రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

 

©️ VIL Media Pvt Ltd.