
బాల్యవివాహాలపై ఐక్యరాజ్యసమితి కీలక ప్రకటన చేసింది. నవంబర్ 27 ను అంతర్జాతీయ బాల్య వివాహాల నిర్మూలన దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ వ్యవస్థాపకుడు భువన్ రిభు, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాటానికి ఒక రోజును కేటాయించాలని ఐక్యరాజ్యసమితికి ఓ తీర్మానాన్ని ప్రతిపాదించారు.ఈ తీర్మానాన్ని సెప్టెంబర్ 4న సియెర్రా లియోన్ ఐక్యరాజ్యసమితిలో ఆమోదం పొందింది.
న దేశంలో బాల్య వివాహాలను సంపూర్ణంగా అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నవంబర్ 27, 2024న ప్రతిష్టాత్మకమైన బాల్ వివాహ్ ముక్త్ భారత్ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ చారిత్రాత్మక తేదీని స్ఫూర్తిగా తీసుకుని ఐక్యరాజ్యసమితి నవంబర్ 27ను అంతర్జాతీయ బాల్యవివాహాల నిర్మూలన దినోత్సవం(International Day for the Elimination of Child, Early and Forced Marriage) గా గుర్తించింది.
బాల్యంలో పెళ్లిళ్లు మానవ హక్కుల ఉల్లంఘన అని ప్రపంచ వ్యాప్తంగా చిన్నారుల హక్కులను పరిరక్షించడం, ఆడపిల్లల భవిష్యత్తుకు భద్రత కల్పించడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. భారత్ కు చెందిన చైల్డ్ రైట్స్ యాక్టివిస్ట్, జస్ట్ రైట్ ఫర్ చిల్ర్డన్స్ వ్యవస్థాపకుడు రిభు, భారత ప్రభుత్వం చేసిన నిరంతర కృషికి దక్కిన ఈ అంతర్జాతీయ గుర్తింపు దక్కింది.
अयं निजः परो वेति गणना लघुचेतसाम्।
उदारचरितानां तु वसुधैव कुटुम्बकम्॥As the United Nations passes landmark resolution to establish #27November as the International Day for the Elimination of Child, Early and Forced Marriage, this moment brings together the persistence of civil… pic.twitter.com/VlslBTF3Y9
— Bhuwan Ribhu (@Bhuwan_Ribhu) September 4, 2026