
కొంచెం తిన్నా కూడా కడుపు ఉబ్బరంగా ఉంటోంది అన్నది ఈరోజుల్లో చాలామంది కంప్లైంట్. గ్యాస్ సమస్య, అజీర్తి ఇందుకు ప్రధాన కారణం. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ఒత్తిడితో, అధిక పనిభారం ఉన్న ఉద్యోగం, వయసు పైబడటం వంటివి కూడా దీనికి కారణాలుగా చెప్పచ్చు. అయితే, ఈ లక్షణాలు రోజూ కనిపిస్తుంటే.. మీ ఆహారం, అలవాట్లను మార్చుకోవడం మంచిది.
ముఖ్యంగా మహిళల్లో ఎప్పుడూ అలసట, బ్లోటింగ్ వంటి సమస్యలు వచ్చినప్పుడు ఆహారం తీసుకోవడం పూర్తిగా మానేస్తుంటారు. అలా చేయకూడదని సూచిస్తున్నారు నిపుణులు.
ఆహారపు అలవాట్లు:
శరీరం నిద్ర, ఒత్తిడి, హార్మోన్లు, శారీరక శ్రమ, జీర్ణక్రియ వంటి అనేక అంశాల వల్ల ప్రభావితమవుతుంది. అయితే, మనం తీసుకునే భోజనం లో నిజంగా పోషకాలు రోజువారీ ఆహారపు అలవాట్లు కూడా ప్రభావం చూపుతాయి.
రోజును కాఫీతో ప్రారంభించి, అల్పాహారం మానేసి, మధ్యాహ్న భోజనాన్ని హడావిడిగా ముగించి, మధ్యాహ్నం పూట ఏదైనా తీపి పదార్థం తీసుకుంటే, ఇది టెక్నికల్ గా రోజంతా తింటున్నప్పటికీ, ప్రోటీన్, ఫైబర్, ఐరన్, ఇతర పోషకాలు తగినంత మోతాదులో అందకపోవచ్చు. ఈ పద్ధతి కొనసాగితే, భోజనం శరీరానికి అవసరమైన పోషకాలను అందించకపోయినా, కడుపు నిండిన అనుభూతిని కలుగుతుంది.
గ్లూటెన్, పాల ఉత్పత్తులు మానొద్దు:
కడుపు ఉబ్బరానికి వివిధ కారణాలు ఉండవచ్చు, కాబట్టి ప్రతి సమస్యను విడివిడిగా పరిష్కరించడం ముఖ్యం. గుడ్డిగా గ్లూటెన్, పాల ఉత్పత్తులు, కార్బోహైడ్రేట్లను వెంటనే మానేయవద్దని అంటున్నారు నిపుణులు. దానికి బదులుగా, కొన్ని వారాల పాటు మీరు తినే ఆహారం, లక్షణాల డైరీని రాసుకోవడం వల్ల, వాటిలో ఉండే నమూనాలను గుర్తించవచ్చని అంటున్నారు.
►ALSO READ | జ్యోతిష్యంః కృష్ణాష్టమి రోజు అరుదైన యోగాలు.. శ్రీకృష్ణుడికి ఏ రాశి వారు ఏమి సమర్పించాలి….
ఏం తిన్నారు, ఎంత వేగంగా తిన్నారు, ఎంత పరిమాణంలో తిన్నారు, కడుపు ఉబ్బరం ఎప్పుడు మొదలైంది అనే వివరాలను డైరీలో రాసుకోవాలి… కొన్నిసార్లు, సమస్య ఆహారం వల్ల కాకుండా, తినే పద్దతి ద్వారా కూడా వస్తుందని అంటున్నారు.
ఐరన్, విటమిన్ సి ముఖ్యం:
మొక్కల ఆధారిత ఐరన్ వనరులను, విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలతో కలిపి తీసుకోవడం ద్వారా కడుపు ఉబ్బరం సమస్యను అధిగమించవచ్చని అంటున్నారు. మొక్కల ఆధారిత ఐరన్ వనరులు ఉన్న భోజనంతో పాటు నిమ్మకాయ, టమోటాలు, ఉసిరి, జామకాయ వంటివి క్రమం తప్పకుండ తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
ప్రోటీన్ అనేది కేవలం ఫిట్‌నెస్ ప్రియులకే పరిమితం కాకూడదని… సమతుల్యమైన, సంతృప్తికరమైన ఆహారంలో భాగంగా తగినంత ప్రోటీన్‌ను చేర్చుకోవచ్చని అంటున్నారు. గుడ్లు, పాల ఉత్పత్తులు, పనీర్, పప్పుధాన్యాలు, చేపలు వంటి ఆహారాలు సాధారణ భోజనంలో భాగంగా ప్రోటీన్‌ను అందిస్తాయని అంటున్నారు నిపుణులు.
కాబట్టి కడుపు ఉబ్బరం అనిపించగానే.. సొంతంగా నిర్దారణకు వచ్చి తిండి మానేయడం కాకుండా ప్రోటీన్, ఫైబర్, ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు, పండ్లు, కూరగాయలు, తగినంత నీరు తాగడంపై శ్రద్ధ పెట్టడం మరింత మంచిదని అంటున్నారు నిపుణులు.