
రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం రేట్లు ఎప్పుడు తగ్గుతాయా షాపింగ్ చేద్దాం అని చాలా మంది మిడిల్ క్లాస్ ప్రజలు ఎదురుచూస్తున్నారు. వారికి ఈ వీకెండ్ చక్కటి అవకాశం దొరికేసింది. గత వారం రోజులుగా పెరుగుతూ భయం పుట్టిస్తున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. అయితే శనివారం తగ్గిన రేట్లలో షాపింగ్ చేసే ముందుగా తమ నగరాల్లోని రిటైల్ రేట్లను తెలుసుకోవటం బెటర్.
సెప్టెంబర్ 5న బంగారం రేట్లు తగ్గాయి. సెప్టెంబర్ 4 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా రూ.186 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 480గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 190గా కొనసాగుతోంది.
శనివారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. సెప్టెంబర్ 5, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీ రూ.2లక్షల 55వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.255 దగ్గర ఉంది.