
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రోజురోజుకూ పెరుగుతున్న కాస్ట్ ఆఫ్ లివింగ్, ఇల్లు కొనుగోలుపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. నెలకు రూ.80వేలు సంపాదిస్తున్న ఒక యువకుడు అడిగిన ప్రశ్నకు కంటెంట్ క్రియేటర్ విశాల్ భార్గవ ఇచ్చిన సలహా ఇప్పుడు వైరల్ గా మారింది. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే ముంబైలో ఈ మొత్తం చాలా తక్కువని.. ఈ నెలవారీ సంపాదన దాదాపు పేదరికంతో సమానమని చెప్పాడు. అంటే నెలకు లక్ష సంపాదించినా ముంబైలో పేదలుగా బతకాల్సిందే అన్నమాట.
ముంబైలోని అంధేరి లాంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ధరలు అత్యంత గరిష్ట స్థాయిలో ఉన్నాయి. 24 ఏళ్ల వయసులోనే ఇల్లు కొనాలనే ఆలోచన ఆర్థికంగా పెనుభారంగా మారుతుందని భార్గవ హెచ్చరించారు. చిన్న వయసులోనే భారీ హోమ్ లోన్ ఊబిలో చిక్కుకోవడం వల్ల కెరీర్ పరంగా కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయని, ఇది మానసిక ఒత్తిడికి దారితీస్తుందని స్పష్టం చేశారు.
A 24-year-old earning ₹80k/month and renting in Andheri wanted to buy a home. Anywhere.
It’s a bad idea. ₹80k/month salary is almost poverty line in Mumbai.
Instead focus on career, save, earn more – and then buy in Andheri. Buy Late but Buy Right. pic.twitter.com/wrhqPClAwC— Vishal Bhargava (@VishalBhargava5) September 3, 2026
ఇక ప్రాపర్టీ ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయనే అపోహను కూడా ఆయన కొట్టిపారేశారు. కొన్ని ప్రాంతాలలో ఇళ్ల ధరలు సంవత్సరాల తరబడి స్థిరంగా ఉండటమే కాకుండా పడిపోయే అవకాశం కూడా ఉందని తెలిపారు. తొందరపడి ఇల్లు కొనడం కంటే.. యువత తమ నైపుణ్యాలను పెంచుకోవడంపై, ఆదాయాన్ని వృద్ధి చేసుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు కంటెంట్ క్రియేటర్.
►ALSO READ | నార్వేలో డ్రైవింగ్ లైసెన్స్ కోసం రూ.6 లక్షలు ఖర్చా..? 2 ఏళ్లు ప్రాక్టీస్ చేశానన్న టెక్కీ
తొందరపాటు నిర్ణయాలు మానుకొని ఆర్థికంగా స్థిరపడిన తర్వాతే కోరుకున్న ప్రాంతంలో ఇల్లు కొనుక్కోవటం బెటర్ అని భార్గవ సూచించారు. ముంబై లాంటి మహా నగరాల్లో నివసించాలంటే కేవలం సాధారణ జీతం సరిపోదని, భవిష్యత్ లక్ష్యాల కోసం ప్రణాళికాబద్ధంగా ప్లాన్ చేసుకుంటూ అడుగులు వేయడమే ఏకైక మార్గమని స్పష్టం అవుతోంది.