Reading Time: < 1 minute

కొండా సురేఖ ఎపిసోడ్ లో హైకమాండ్ దే  ఫైనల్ డెసిషన్:  రాజగోపాల్ రెడ్డి

Caption of Image.

మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో  పార్టీ అధిష్టానందే తుది నిర్ణయమని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు.  కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, మంత్రివర్గ విస్తరణపై అధిష్టానమే తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. రాబోయే కాలంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా అందరం కలిసి పనిచేస్తామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  అన్నారు.  యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని పలు గ్రామాల్లో రూ.200 కోట్ల భారీ ఆర్ అండ్ బీ నిధులతో డబల్ రోడ్డు పనులకు  రాజగోపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తన సోదరుడు, ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల రూపురేఖలు మారుస్తున్నామని, ఈ అభివృద్ధి పనులతో నియోజకవర్గ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందని స్పష్టం చేశారు. పదేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీపై పోరాటం చేసిన ప్రతి కార్యకర్తకూ తగిన న్యాయం జరుగుతుందని భరోసానిచ్చారు.

కొండా సురేఖ రాజీనామ ాచేస్తారా? లేదా బర్తరఫ్ చేస్తారా? అనేదానిపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్  గా మారింది. సీఎం రేవంత్  రెడ్డి ఇవాళ ఢిల్లీ నుంచి రాగానే సురేఖ ఎపిసోడ్ క్లైమాక్స్ కు ఎండ్ కార్డు పడనుంది. 

 

©️ VIL Media Pvt Ltd.