Reading Time: < 1 minute
The Paradise Yeshanagula Song 50 Million Views Record

టాలీవుడ్ సంగీత ప్రపంచంలో సరికొత్త చరిత్ర నమోదైంది. ‘ది ప్యారడైజ్’ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన పవర్ ఫుల్ మాస్ ట్రాక్ ‘యేషనాగుల’ (Yeshanagula) ఇంటర్నెట్‌లో సునామీ సృష్టిస్తోంది. విడుదలైన కేవలం ఐదు రోజుల్లోపే ఏకంగా 50 మిలియన్లకు (50M+) పైగా వ్యూస్ కొల్లగొట్టి, తెలుగులోనే అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన పాటగా సరికొత్త ఆల్-టైమ్ రికార్డును నెలకొల్పింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాటే మారుమోగిపోతోంది. విడుదలైన క్షణం నుంచే చార్ట్‌బస్టర్‌గా మారిన ఈ గీతం, ఇప్పుడు సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా, దేశ విదేశాల్లోని శ్రోతలను సైతం తన మాస్ బీట్స్‌తో కట్టిపడేస్తూ ఒక ‘గ్లోబల్ మాస్ మ్యూజిక్ మూవ్‌మెంట్’గా మారింది.

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో ఎక్కడ క్లిక్ చేసినా ఈ పాటకు సంబంధించిన డ్యాన్స్ వీడియోలే దర్శనమిస్తున్నాయి. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ వచ్చినప్పటికీ, ఐదు రోజుల వ్యవధిలోనే 50 మిలియన్ల మార్కును దాటడం అనేది సాధారణ విషయం కాదు. ఈ పాటలోని మాస్ ఎనర్జీ, ఆకట్టుకునే రిథమ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. యూట్యూబ్‌లో వ్యూస్ పరుగులు తీస్తున్న వేగం చూస్తుంటే, రాబోయే రోజుల్లో ఈ ‘ఎశానగుల’ సాంగ్ మరిన్ని గ్లోబల్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.