
ప్రముఖ లగ్జరీ హోమ్ బ్రాండ్ స్టాన్లీ లైఫ్ స్టైల్స్ లిమిటెడ్ ఇంటీరియర్ డిజైనింగ్ రంగంలో గ్లోబల్ విస్తరణకు శ్రీకారం చుడుతూ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో తమ మొదటి ‘స్టాన్లీ సుపర్టివ్ లివింగ్’ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను ప్రారంభించింది.
72వేల చదరపు అడుగుల వైశాల్యంలో 6 అంతస్తుల్లో విస్తరించి ఉన్న ఈ అత్యంత భారీ స్టోర్‌ను తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోదాడ ఎమ్మెల్యే శ్రీమతి ఎన్. పద్మావతి రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. 3 దశాబ్దాల అనుభవం కలిగిన స్టాన్లీ లైఫ్ స్టైల్స్, విలాసవంతమైన జీవనశైలికి అనుగుణంగా ఫర్నిచర్, కిచెన్లు, వార్డ్‌రోబ్‌లు, లైటింగ్, డెకార్, ఆర్ట్ అండ్ డిజైన్ నైపుణ్యాన్ని ఒకే చోట లభించేలా ఈ స్టోర్‌ను తీర్చిదిద్దింది. వినియోగదారులకు పూర్తిస్థాయి ఇంటీరియర్ అనుభూతిని అందించేందుకు ఇందులో 60కి పైగా ప్రత్యేక రూమ్ సెట్టింగ్‌లను ప్రదర్శిస్తున్నారు. జర్మనీ, జపాన్, స్పెయిన్, బెల్జియమ్‌కు చెందిన అంతర్జాతీయ బ్రాండ్ల భాగస్వామ్యంతో కొన్ని కలెక్షన్లను అందించారు.
ALSO READ : బ్యాంకు ఉద్యోగుల సమ్మె సైరన్: సెప్టెంబర్ 11, 28, 29, 30 తేదీల్లో బ్యాంక్స్ బంద్!
హైదరాబాద్‌లో వేగంగా పెరుగుతున్న ప్రీమియం, విల్లా నివాసాల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ తొలి స్టోర్‌ను ఇక్కడ ఏర్పాటు చేసినట్లు కంపెనీ చైర్మన్ సునీల్ సురేష్, ఎండీ వెంకటరమణ గోర్తి తెలిపారు. లగ్జరీ హోమ్ రిటైల్ విభాగంలో నూతన అధ్యాయానికి తెరలేపిన ఈ ఫార్మాట్‌ను భవిష్యత్తులో దేశంలోని ప్రధాన నగరాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లకు విస్తరింపజేయనున్నట్లు వెల్లడించారు.