Reading Time: 2 minutes

సీఎం విజయ్ విజన్ పై అజిత్ ప్రశంసలు.. ‘మోటార్ స్పోర్ట్స్ సిటీ’ ఏర్పాటుపై కీలక ప్రకటన!

Caption of Image.

రేసింగ్ ట్రాక్‌పై సూపర్ ఫాస్ట్ రైడర్.. వెండితెరపై కోట్ల మంది అభిమానించే మాస్ గాడ్.. తమిళ ఇండస్ట్రీ అల్టిమేట్ స్టార్ అజిత్ కుమార్. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎంతటి విపరీతమైన క్రేజ్ ఉందో, మోటార్ స్పోర్ట్స్ రంగంలోనూ ఆయనకి అంతే స్థాయిలో అన్‌స్టాపబుల్ పాషన్ ఉందనేది అందరికీ తెలిసిందే. ఫార్ములా BMW ఆసియా, బ్రిటిష్ ఫార్ములా 3, 2010లో ప్రతిష్టాత్మక FIA ఫార్ములా 2 ఛాంపియన్‌షిప్‌ల వరకు రేసింగ్ సర్క్యూట్‌లో గంటకు వందల కిలోమీటర్ల వేగంతో కార్లను పరిగెత్తించిన ఏకైక అగ్ర హీరో అజిత్..

లేటెస్ట్ గా రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన ‘మోటార్ స్పోర్ట్స్ సిటీ’ ని నిర్మిస్తున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రకటించారు. చెన్నై నగర ముఖచిత్రాన్ని మార్చేలా ఒక భారీ ప్లాన్‌ను ఆవిష్కరించారు. అందులో ఏకంగా  రూ1,200 కోట్ల వ్యయంతో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన సచివాలయ కాంప్లెక్స్, ఒలింపిక్ సిటీతో పాటు సరికొత్తగా ‘మోటార్ స్పోర్ట్స్ సిటీ’ని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. దీనిపై అజిత్ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు.

సాధారణంగా స్టేట్‌మెంట్లకు దూరంగా ఉండే హీరో అజిత్.., ఈ నిర్ణయం వినగానే విపరీతమైన ఉత్సాహంతో స్పందించారు. అంతరిక్షంలోకి అడుగుపెట్టిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చెప్పిన ఐకానిక్ డైలాగ్‌ను రీ-మిక్స్ చేస్తూ.. “తమిళనాడు ప్రభుత్వం వేసిన ఈ ఒక్క చిన్న అడుగు.. రేపటి భారతీయ మోటార్ స్పోర్ట్స్ రంగానికి ఎంతో తోడ్పాటును అందిస్తుంది” అంటూ సీఎం విజయ్‌కి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది కేవలం క్రీడలకు మాత్రమే కాకుండా .. రేసింగ్‌ను ప్రాణంగా భావించే యువతకు ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ అని కొనియాడారు.

►ALSO READ | Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10’ హౌస్‌లోకి ఆ 20 మంది.. లీకైన కంటెస్టెంట్ల లిస్ట్ ఇదేనా?

ప్రస్తుతం ఒకవైపు రేసింగ్, మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న అజిత్, తన రేసింగ్ కమిట్‌మెంట్స్ పూర్తి కాగానే అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ‘డేర్ డెవిల్’ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నారు. ఈ సినిమాతో అజిత్ భార్య, మాజీ నటి శాలిని తొలిసారిగా నిర్మాతగా మారుతున్నారు.. రియల్ లైఫ్‌లో రేసింగ్ హంగామా, రీల్ లైఫ్‌లో బిగ్ స్క్రీన్ డామినేషన్‌తో తలైవా అజిత్ మాస్ రచ్చ మొదలైంది. ప్రస్తుతం విజయ్ ను ప్రశంసిస్తూ విడుదల చేసిన ప్రకటన నెట్టింట వైరల్ అవుతోంది..

 

©️ VIL Media Pvt Ltd.