Reading Time: < 1 minute

భర్త కంటే భార్య ఎక్కువ సంపాదిస్తే.. భరణం ఇవ్వాల్సిన అవసరం లేదు: బాంబే హైకోర్టు

Caption of Image.

భార్యకు భరణం విషయంలో ముంబై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భర్త కంటే ఎక్కువ సంపాదించే భార్యకు జీవనభృతి కింద భరణం చెల్లించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. న్యూజెర్సీ నివసిస్తున్న ఓ మహిళ తన భర్తనుంచి భరణం కోరుతూ ముంబై కోర్టు లో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ చేపట్టిన న్యాయమూర్తి..పిటిషన్ తిరస్కరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

న్యూజెర్సీలో నివసిస్తున్న పిటిషనర్ ఆదాయం నెలకు రూ. 8లక్షలు ఉండగా.. అది ఆమె భర్త సంపాదన కంటే ఎక్కువ. విదేశాల్లో జీవన వ్యయం ఎక్కువగా ఉండటం కారణం చూపుతూ ఆమె భర్త నుంచి మధ్యంతర భరణం కోరింది. దీనిపై కోర్టు అభ్యంతరం చేసింది. 

అంతకుముందు కూడా ఇదే కేసులో విచారణ చేపట్టిన ఫ్యామిలీ కోర్టు కూడా ఆమె భరణం పిటిషన్ ను తిరస్కరిచింది. పిటిషనర్ కు ఇద్దరు కుమార్తెలు ఉండగా ఒకరు తండ్రి సంరక్షణలో ఉన్నారు. మరొకరు  తల్లి సంరక్షణలో ఉన్నారు. అయితే ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వును సవాలు చేస్తూ ఆ మహిళ హైకోర్టును ఆశ్రయించింది. 

©️ VIL Media Pvt Ltd.