
Pralhad Joshi : నీట్ పేపర్ లీకేజీ వివాదం భారత దేశవ్యాప్తంగా కొనసాగుతున్న విద్యార్థుల నిరసనల నడుమ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి ఇవాళ ( జులై 25న, శనివారం) రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన సలహా మేరకు, ధర్మేంద్ర ప్రధాన్ సమర్పించిన రాజీనామాను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా ఆమోదించింది.
ప్రహ్లాద్ జోషికి అదనపు బాధ్యతలు:
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఖాళీ అయిన విద్యాశాఖ బాధ్యతలను సీనియర్ క్యాబినెట్ మంత్రి ప్రహ్లాద్ జోషికి అప్పగించారు. ప్రధాని మోడీ సూచన మేరకు రాష్ట్రపతి ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రహ్లాద్ జోషి ప్రస్తుతం నిర్వహిస్తున్న శాఖలతో పాటు కేంద్ర విద్యాశాఖ (Ministry of Education) బాధ్యతలను కూడా అదనంగా పర్యవేక్షించనున్నారు.
కేంద్ర కీలక నిర్ణయం:
NEET పేపర్ లీకేజీ వివాదం, విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం దేశవ్యాప్తంగా విద్యార్థులు పెద్ద ఎత్తున చేస్తున్న పోరాటంతో కేంద్ర సర్కార్ ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు ఇవ్వడం ఇప్పుడు కీలకంగా మారింది. విద్యార్థుల్లో నమ్మకాన్ని పెంపొందంచడంతో పాటు విద్యా వ్యవస్థలో పారదర్శకతను తీసుకు రావడం కోసం కొత్తగా బాధ్యతలు తీసుకుంటున్న మంత్రి జోషి ఏ మేరకు కృషి చేస్తారో చూడాలి మరీ.
President Droupadi Murmu, as advised by the Prime Minister, has accepted the resignation of Dharmendra Pradhan.
Further, as advised by the Prime Minister, the President has directed that Pralhad Joshi, Cabinet Minister, be assigned the charge of the Ministry of Education, in… pic.twitter.com/rMmTK99zdR
— ANI (@ANI) July 25, 2026