Reading Time: < 1 minute
Cjp Reacts After Dharmendra Pradhan Resignation Neet Protest Demands

CJP: నీట్ వివాదంపై కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో జరుగుతున్న నిరసనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తన రాజీనామా లేఖను పంపినట్లు ఆయన ఒక ట్వీట్‌లో తెలిపారు. దేశ యువతను ఉద్దేశించి రెండు పేజీల ప్రకటనను సైతం పోస్ట్ చేశారు. గత కొద్ది రోజులుగా ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని సీజేపీ పట్టుబట్టుకుని కూర్చింది. ఈ రాజీనామాతో నిరసనలు ఇంతటితో ఆగిపోతాయని అందరూ భావిస్తుండగా.. తాజాగా సీజేపీ సంచలన ట్వీట్ చేసింది. కేవలం ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఇంకా రెండు డిమాండ్లు నెరవేరలేదని పేర్కొంది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని, నిరసన తెలిపిన విద్యార్థులపై ఎటువంటి చర్యలూ తీసుకోకూడదని సీజేపీ స్పష్టం చేసింది. ఈ రెండు డిమాండ్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయంటూ ట్వీట్‌లో పేర్కొంది.