Reading Time: 2 minutes

మన శరీరం మొత్తం ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలంటే పేగులు (గట్) శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం. రోగనిరోధక శక్తిలో దాదాపు 70 శాతం పేగుల ఆరోగ్యానికే ముడిపడి ఉంటుంది. పేగులు సరిగ్గా శుభ్రపడకపోతే మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ మరియు ఇన్ఫెక్షన్లు తలెత్తుతాయి. మరి రోజువారీ ఆహారంలో ఎలాంటి పదార్థాలు చేర్చుకోవడం ద్వారా పేగులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చో ఇప్పుడు చూద్దాం..

ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు: ఫైబర్ పేగుల్లోని వ్యర్థాలను, టాక్సిన్స్‌ను తుడిచిపెట్టే క్లీనింగ్ ఏజెంట్‌లా పనిచేసి మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇక అందుకోసం పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలు, పెక్టిన్ ఫైబర్ ఉండే యాపిల్స్, బొప్పాయి, అరటిపండ్లతో పాటు ఓట్స్, బ్రౌన్ రైస్ వంటి తృణధాన్యాలను తరచుగా తీసుకోవాలి.

Want Better Gut Health? Add These Foods to Your Daily Diet
Want Better Gut Health? Add These Foods to Your Daily Diet

ప్రోబయోటిక్స్ – మంచి బ్యాక్టీరియా: పేగుల్లోని హానికర బ్యాక్టీరియాను తొలగించి, జీర్ణక్రియను పెంచే మంచి బ్యాక్టీరియాను ప్రోబయోటిక్ ఆహారాలు అందిస్తాయి. ఇక పెరుగు, మజ్జిగను రోజూ తీసుకోవడం వల్ల పేగులు చల్లబడతాయి. అలాగే ఇడ్లీ, దోశ వంటి పులియబెట్టిన ఆహారాలు కూడా గట్ హెల్త్‌కు ఎంతో మేలు చేస్తాయి.

ప్రీబయోటిక్స్ మరియు విత్తనాలు: వెల్లుల్లి, ఉల్లిపాయలు పేగుల్లోని మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా ఉపయోగపడతాయి. ఇక వీటిలోని యాంటీబ్యాక్టీరియల్ గుణాలు చెడు సూక్ష్మజీవులను సంహరిస్తాయి. అలాగే చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ మలాన్ని సాఫీగా సాగేలా చేస్తే, అల్లం మరియు పసుపు జీర్ణక్రియ వేగాన్ని పెంచుతాయి.

నీరు చాలా అవసరం: మీరు ఎంత ఫైబర్ ఆహారం తిన్నా, తగినంత నీరు తాగకపోతే ప్రయోజనం ఉండదు. రోజుకు కనీసం 2 నుండి 3 లీటర్ల నీరు తాగడం వల్ల పేగులలోని చెత్త, వ్యర్థాలు సులువుగా బయటకు వెళ్ళిపోతాయి.

పేగుల ఆరోగ్యం బాగుంటేనే మనం సరైన పోషకాలను గ్రహించి ఆరోగ్యంగా ఉండగలము. రోజువారీ జీవనశైలిలో చిన్నపాటి ఆహార మార్పులు చేసుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థను క్లీన్‌గా, ఫ్రిష్‌గా ఉంచుకోవచ్చు.

గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడింది. తీవ్రమైన మలబద్ధకం లేదా జీర్ణక్రియ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే వైద్యులను సంప్రదించడం మంచిది.

The post పేగులు క్లీన్‌గా ఉండాలా? రోజువారీ డైట్‌లో ఈ ఫుడ్స్‌ చేర్చుకోండి! appeared first on Manalokam – Latest Telugu News & Updates.