మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ తగిన ప్రతిఫలం ఉంటుంది. వృత్తి జీవితంలో యాక్టివిటీ బాగా విస్తరిస్తుంది. వ్యాపారాల్లో కొత్త వ్యూహాలను, ప్రణాళికలను అమలు చేస్తారు. ఆర్థిక విషయాల్లో వారమంతా బాగానే గడిచిపోతుంది. ప్రధాన గ్రహాల సంచారం బాగున్నందువల్ల ముఖ్యమైన పనులన్నీ సానుకూలపడతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధించే అవ కాశం ఉంది. కొద్దిగా పట్టు విడుపులతో వ్యవహరిస్తే బంధుమిత్రుల నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయానికి లోటుండదు. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా ఆశించిన పురోగతి ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి బాగా పెరిగే అవకాశం ఉంది. అదనపు బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు, శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఆదాయపరంగా ఇతరులకు సహాయం చేసే పరిస్థితిలో ఉంటారు. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. దగ్గర బంధువులతో వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లు పెరుగుతారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. షేర్లు బాగా లాభిస్తాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఉద్యోగులకు అధికార యోగం పడుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో ఇతరుల మీద ఆధారపడక పోవడం మంచిది. వారం మధ్యలో ఒక శుభ పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. అయితే, కుటుంబ ఖర్చులు బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. అవసరానికి మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవు తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఎటువంటి పనులు చేపట్టినా విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో జీవిత భాగస్వామికి గుర్తింపు లభిస్తుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వృత్తి, ఉద్యోగాల్లో చాలావరకు అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. అదనపు బాధ్యతల వల్ల కొద్దిగా శ్రమ పెరిగినప్పటికీ ఆర్థిక ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారాల్లో భాగస్వాములతో విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలన్నీ సానుకూలపడతాయి. మాటకు విలువ పెరు గుతుంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. నిరుద్యోగులు ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. సోదరులతో ఆస్తి వివాదాలు ఇబ్బంది కలిగి స్తాయి. తలపెట్టిన పనులు కొద్దిగా నిదానంగా పూర్తవుతాయి. దాదాపు అన్ని రంగాల వారి మీదా ఒత్తిడి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాల్లో ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుతారు. ఉద్యోగానికి సంబంధించి మెరుగైన అవకాశాలు అంది వస్తాయి. నిరు ద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బందులు తొలగుతాయి. సాధారణంగా ఏ పని తలపెట్టినా సానుకూల ఫలితాలనిస్తుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల్ని సమ యస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ముందుకు సాగుతుంది. కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శిస్తారు. రాజకీయాలు, రియల్ ఎస్టేట్, డాక్టర్లు, ఇంజనీర్లకు నిమిషం కూడా తీరిక దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగాల కారణంగా దూర ప్రయా ణాలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆశించిన శుభవార్తలు వింటారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. ఆస్తుల కొనుగోలుకు అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో కొత్త ఉత్సాహంతో పురోగతి చెందుతారు. ఉద్యోగంలో పని భారం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రతిఫలాలు, ప్రోత్సాహకాలు లభి స్తాయి. గృహ నిర్మాణానికి సకాలంలో రుణం అందుతుంది. కొత్త కార్యక్రమాలు చేపట్టి సజావుగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్నిస్తుంది. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభించకపోవచ్చు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆదాయ ప్రయత్నాల్లో శ్రమ పెరుగుతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఉద్యోగంలో పని ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. వృత్తి జీవితం బాగా బిజీగా సాగుతుంది. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించి వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. ప్రయాణాల్లో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇతరులతో వివాదాలకు బాగా దూరంగా ఉండడం మంచిది. వారం చివర్లో కొద్దిగా శ్రమతో కానీ పనులు పూర్తి కావు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): గ్రహ బలం బాగున్నందువల్ల వృత్తి, ఉద్యోగాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు బాగా పెరుగుతాయి. సోదరులతో ఆస్తి వివాదం ఇబ్బంది పెడు తుంది. పిల్లలు చదువుల్లో బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. తలపెట్టిన పనులు చాలావరకు పూర్త వుతాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఖర్చుల్ని నియంత్రించడం మంచిది.బంధు మిత్రులతో ఆచితూచి వ్యవహరించడం అవసరం. కుటుంబ సమస్యల విషయంలో జీవిత భాగ స్వామిని కూడా సంప్రదించడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన స్పందన కనిపిస్తుంది. వ్యక్తిగత సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఉద్యోగంలో జీత భత్యాలు, ప్రమోషన్లకు సంబంధించిని శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల విస్తరణకు మార్గం సుగమం అవు తుంది. ఆర్థికపరమైన ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. మిత్రులతో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్య మైన వ్యవహారాల్లో అంచనాలను అందుకుంటారు. దూరపు బంధువుల సహాయంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. కుటుంబ జీవితంలో ఒకటి రెండు శుభ పరిణామాలు సంభవిస్తాయి. గృహ, వాహన సౌకర్యాలకు ప్లాన్ వేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆదాయానికి లోటుండదు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఉద్యోగాల్లో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్ని విస్తరించే అవకాశం ఉంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. వాహన యోగం పడుతుంది. ముఖ్య మైన వ్యవహారాల్లో శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది. సోదరులతో ఆస్తి వివాదంలో రాజీ మార్గం అనుసరిస్తారు. కొన్ని వ్యక్తిగత పనుల్లో జాప్యం జరిగినా, నిదానంగా పూర్తి చేస్తారు. స్వల్ప అనా రోగ్యానికి అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. ఇంటా బయటా పని ఒత్తిడి ఉంటుంది. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా పురోగతి ఉంటుంది. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు లభిస్తాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపో తాయి. కుటుంబంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభి స్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ పెద్దల సలహాలను కూడా తీసుకోవడం మంచిది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త కార్యక్రమాలను ప్రారంభించి సకా లంలో పూర్తి చేస్తారు. బంధువులతో ఇంట్లో సందడిగా గడుపుతారు. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో సామాన్య లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి, అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించడం మంచిది. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంది. కుటుంబ సమేతంగా దైవ దర్శనాలు చేసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వారం మధ్యలో దూర ప్రాంతం నుంచి శుభవార్తలు అందుతాయి. కొత్త వాహనం సమకూరే అవకాశం ఉంది. సోదరులతో సఖ్యత, సామరస్యం ఏర్పడతాయి. కొందరు సన్నిహితుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.











