Reading Time: 2 minutes
Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..

సాయి పల్లవి.. క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సహజ సిద్ధమైన నటనతో, అద్భుతమైన డ్యాన్స్‌తో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. ‘ప్రేమమ్’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన ఈ బ్యూటీ, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా తనకంటూ భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఫిదా, లవ్ స్టోరీ, ఎంసీఏ, శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం వంటి హిట్ చిత్రాలతో తెలుగు అడియన్స్ హృదయాలు కొల్లగొట్టింది. ఇప్పుడు ఈ అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా బిజీ అయ్యింది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో నార్త్ ప్రేక్షకులను అలరిస్తుంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ రామాయణంపై భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే.

ఎక్కువ మంది చదివినవి : Jaya Prada : నటనకే నటన నేర్పిన మహా నటుడు అతడు.. అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. హీరోయిన్ జయప్రద..

ఈరోజు సాయి పల్లవి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీప్రముఖులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలో గతంలో సాయి పల్లవి తన మనసులో మాటను బయటపెట్టింది. తనకు ఓ హీరో అంటే క్రష్ అని, చాలా సంవత్సరాలుగా అతడంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ, తన కాలేజీ రోజుల్లో, అంతకంటే ముందు నుంచే నటుడు సూర్య అంటే తనకు ఎంతో ఇష్టమని వెల్లడించారు. అంతేకాకుండా తన ‘ఫస్ట్ క్రష్’ కూడా సూర్య అని ఆమె మనసులోని మాటను బయటపెట్టారు. ఆయన నటించిన సినిమాలు చూస్తూ తాను పెరిగానని, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, నటన తనను ఎంతో ప్రభావితం చేశాయని పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Vijay Thalapathy : ఆ ఒక్క సినిమా విడుదల కాకపోయి ఉంటే విజయ్, సంగీత పెళ్లి అయ్యేదే కాదు.. తలపతి కెరీర్ మార్చిన ఏకైక మూవీ..

చాలా మంది నటీనటుల్లాగే తాను కూడా సెలబ్రిటీ కావడానికి ముందు ఒక సాధారణ అభిమానిగా ఉన్నానని.. సూర్య సినిమా వస్తుందంటే చాలు ఎంతో ఉత్సాహంగా ఉండేదని చెప్పుకొచ్చింది.. ఆయన్ని చూడాలనే ఆశ ఎప్పటి నుంచో ఉండేదని, ఆయనలోని సింప్లిసిటీ, డెడికేషన్ తనను ఆకర్షించినట్లు ఆమె తెలిపారు. సాయి పల్లవికి తన అభిమాన హీరో సూర్యతో కలిసి ‘NGK’ (నంద గోపాలన్ కుమారన్) చిత్రంలో నటించే అవకాశం దక్కిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తన అనుభూతిని పంచుకుంటూ.. తన ఫేవరెట్ హీరో పక్కన నటించడం ఒక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ అని ఆమె చెప్పారు. షూటింగ్ సమయంలో సూర్య చూపించే క్రమశిక్షణ, తోటి నటీనటులకు ఇచ్చే గౌరవం చూసి ఆయనపై గౌరవం మరింత పెరిగిందని ఆమె వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Raghavendra Rao: 83 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‏గా.. ఆరోగ్యంగా.. రోజూ ఉదయాన్నే తినేది ఇవే.. రాఘవేంద్రరావు..

Sai Pallavi, Suriya

Sai Pallavi, Suriya

ఎక్కువ మంది చదివినవి : Meena : తెలుగు సినిమాల్లో నాకు గుర్తింపు రావడానికి ఆ హీరోనే కారణం.. లేదంటే నేను లేను.. మీనా కామెంట్స్..