July 12, 2026

Vijay Thalapathy : విజయ్ అంటే నాకు పిచ్చి ఇష్టం.. కానీ అతడు త్రిషనే పెళ్లి చేసుకోవాలి.. హీరోయిన్ కామెంట్స్..

Vijay Thalapathy : విజయ్ అంటే నాకు పిచ్చి ఇష్టం.. కానీ అతడు త్రిషనే పెళ్లి చేసుకోవాలి.. హీరోయిన్ కామెంట్స్..
Reading Time: 2 minutes
Vijay Thalapathy : విజయ్ అంటే నాకు పిచ్చి ఇష్టం.. కానీ అతడు త్రిషనే పెళ్లి చేసుకోవాలి.. హీరోయిన్ కామెంట్స్..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో సరికొత్త చరిత్ర సృష్టించారు విజయ్ దళపతి. పార్టీ స్థాపించిన రెండేళ్లకే అత్యధిక మెజారిటీ సాధించారు. కానీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేందుకు ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు విజయ్, త్రిష గురించి పలు రూమర్స్ ముందు నుంచి ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత, వీరిద్దరి పాత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా వారిద్దరి గురించి ఇప్పుడు బాలీవుడు బ్యూటీ రాఖీ సావంత్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇటీవలి ఒక ఇంటర్వ్యూలో త్రిష, విజయ్ గురించి వస్తున్న రూమర్స్ పై రాఖీ సావంత్ స్పందించారు. వారు పెళ్లి చేసుకోవాలని కూడా ఆమె కోరుకుంటున్నానని, త్రిష, తాను కెరీర్‌లను కలిసే ప్రారంభించాం కాబట్టి తనకు త్రిష తెలుసని కూడా రాఖీ సావంత్ పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Raghavendra Rao: 83 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‏గా.. ఆరోగ్యంగా.. రోజూ ఉదయాన్నే తినేది ఇవే.. రాఘవేంద్రరావు..

ఫిల్మీ మంత్ర మీడియాతో మాట్లాడుతూ “నాకు తెలిసి వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలి. మేము వాళ్ల మెహందీ వేడుకకు వెళ్తాము. విజయ్ అంటే నాకు చాలా ఇష్టం. అతడిని వ్యక్తిగతంగా నేను ఎక్కువగా ఇష్టపడతాను. విజయ్‌తో ఒక పాట చేయాలన్నది నా కల, కానీ నాకు ఆ అవకాశం రాలేదు. అయితే, ఇప్పుడు నేను ఆయన పార్టీలో చేరాలనిపిస్తోంది. నాకు త్రిష తెలుసు, వాళ్లిద్దరూ చాలా మంచి జంట” అంటూ చెప్పుకొచ్చింది.

ఎక్కువ మంది చదివినవి : Meena : తెలుగు సినిమాల్లో నాకు గుర్తింపు రావడానికి ఆ హీరోనే కారణం.. లేదంటే నేను లేను.. మీనా కామెంట్స్..

“నేనూ, త్రిష ఇద్దరం బాలీవుడ్‌లో కలిసి కెరీర్ ప్రారంభించాం, కానీ తర్వాత త్రిష దక్షిణాదికి వెళ్లి అక్కడి సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. విజయ్ చాలా మంచి వ్యక్తి. అతడంటే నాకు అభిమానం. అతడి విజయం నాకెంతో సంతోషాన్నిచ్చింది ” అని తెలిపింది. ప్రస్తుతం రాఖీ సావంత్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Vijay Thalapathy : ఆ ఒక్క సినిమా విడుదల కాకపోయి ఉంటే విజయ్, సంగీత పెళ్లి అయ్యేదే కాదు.. తలపతి కెరీర్ మార్చిన ఏకైక మూవీ..

Vijay, Trisha, Rakhi Sawant

Vijay, Trisha, Rakhi Sawant

ఎక్కువ మంది చదివినవి : Jaya Prada : నటనకే నటన నేర్పిన మహా నటుడు అతడు.. అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. హీరోయిన్ జయప్రద..